464 రోజుల తర్వాత శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక సెంచరీ

464 రోజుల తర్వాత శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక సెంచరీ

టీమిండియాలో నెం.4స్థానానికి కొన్నేళ్లుగా పరిశీలనలు జరుగుతున్నా.. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిరూపించుకోలేకపోయాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో ఆ స్థానం ఎప్పటికీ తీరని లోటుగానే కనిపించింది. ఇన్నేళ్లేకు శ్రేయాస్ అయ్యర్ భర్తీ చేసినట్లుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో హామిల్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టుపై సెంచరీ నమోదు చేసి సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన ఘనత సాధించాడు అయ్యర్. 

కోహ్లీతో పాటు బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్.. కేఎల్ రాహుల్‌తో కలిసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ.. 103పరుగులు చేయడంతో భారత్.. 4వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అయితే టీమిండియా బ్యాట్స్‌మెన్లో నాలుగో నెంబర్లో దిగి సెంచరీ చేసి 2020 ఫిబ్రవరి 5కి 16నెలలు అయింది. 29 అక్టోబరు 2018న అంబటి రాయుడు తర్వాత సెంచరీ పూర్తి చేసేందుకు 464రోజులు పట్టింది. 

కెప్టెన్ కోహ్లీ(51)అవుట్ అనంతరం స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేఎల్ రాహుల్(88; 64 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సులు) పార్టనర్ షిప్ తో శ్రేయాస్ అయ్యర్(103; 107బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సు) చెలరేగాడు. 

46వ ఓవర్ వద్ద అయ్యర్ అవుట్ అయినప్పటికీ కేదర్ జాదవ్(26)సహకారంతో రాహుల్ ఇన్నింగ్స్ ముగించాడు. ఓపెనర్లు పృథ్వీ షా(20), మయాంక్ అగర్వాల్(32)లు 9ఓవర్ల పాటు వికెట్లు కాపాడుకోగలిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2వికెట్లు తీయగా, గ్రాండ్ హోమ్, ఇష్ సోధీ చెరో వికెట్ తీయగలిగారు.