IND vs NZ WTC Final: తొలి ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ స్కోరు 217

IND vs NZ WTC Final: తొలి ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ స్కోరు 217

India vs New Zealand WTC Final

IND vs NZ WTC Final: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జామిసన్ 5 వికెట్లు పడగొట్టి భారత ఆటగాళ్లను త్వరగా పెవిలియన్ పంపడంలో సాయపడ్డాడు.

రోహిత్ శర్మ, షుబ్మాన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు మంచి ఆరంభం ఇచ్చి, మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు, కాని కైల్ జామిసన్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు. తర్వాత కోహ్లీ, రహానే నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ కాపాడారు.

ఓవర్ నైట్ స్కోరు 146/3తో మూడో రోజు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత జట్టు స్వల్ప వ్యధిలోని నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 149 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (44), 156 పరుగుల వద్ద రిషభ్ పంత్ (4) అవుట్ అవ్వగా.., అజింక్య రహానే 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. జడేజాతో కలిసి జాగ్రత్తగా ఆడుతున్నట్టు కనిపించిన అశ్విన్ అవుటడంతో భారత జట్టు తక్కువ స్కోరు చేస్తుందని ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలోనే 217పరుగులకే అందరూ అవుట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో జెమీసన్ 5 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, వాగ్నర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు.