India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. చివరి ఓవర్ ‘నో బాల్’పై వివాదం.. ఎవరేమంటున్నారంటే!

భారత్-పాక్ మ్యాచ్‌, చివరి ఓవర్ నాలుగో బంతిని అంపైర్లు ‘నో బాల్’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ‘నో బాల్’పై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతుంటే, మరికొందరు సమర్ధిస్తున్నారు.

India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. చివరి ఓవర్ ‘నో బాల్’పై వివాదం.. ఎవరేమంటున్నారంటే!

India Vs Pakistan: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో భారత్ అద్భుత విజయం సాధించింది.

Indians in Ukraine: ఈ మార్గాల్లో బయటపడండి.. యుక్రెయిన్‌లోని భారతీయులకు ప్రభుత్వ సూచన

అయితే, ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన నాలుగో బాల్‌ను అంపైర్లు ‘నో బాల్’గా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహ్మద్ నవాజ్ ఈ బాల్‌ను ఫుల్ టాస్ వేశాడు. దీన్ని కోహ్లీ సిక్సర్‌గా మలిచాడు. అయితే, ఈ బాల్ నడుము ఎత్తులో రావడంతో అంపైర్లు దీన్ని ‘నో బాల్’గా ప్రకటించాడు. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అప్పుడే పాక్ క్రీడాకారులు దీన్ని వ్యతిరేకించారు. పాక్ టీం సభ్యులంతా ఈ నిర్ణయంపై అంపైర్‌ను ప్రశ్నించారు. కానీ, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నో బాల్ తర్వాతి బంతి ఫ్రీ హిట్‌గా ఉంటుంది. ఈ బంతికి బ్యాటర్ బౌల్డ్ అయినా, అది ఔట్ కిందకు రాదు. దీన్ని కోహ్లీ చక్కగా వినియోగించుకున్నాడు.

Karnataka: పేరెంట్స్ నుంచి రూ.100 వసూలు నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కారు.. ఆదేశాలు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బౌల్డ్ అయినా, ఆ బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. దీంతో కోహ్లీ మూడు పరుగులు తీశాడు. ఈ రెండు బంతులే భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే, నడుము ఎత్తులో బంతి వచ్చినప్పుడు అంపైర్లు రివ్యూ తీసుకోకుండా, నో బాల్ అని ఎలా ప్రకటిస్తారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ ట్విట్టర్లో ప్రశ్నించాడు. అలాగే ఫ్రీ హిట్ బంతికి కోహ్లీ బౌల్డ్ అయితే, దాన్ని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదని బ్రాడ్ హాగ్ అన్నాడు. కాగా, బాల్ నడుముకంటే ఎక్కువ ఎత్తులో వస్తేనే దాన్ని నో బాల్ అంటారని కొందరు అంటుంటే, అంపైర్లదే తుది నిర్ణయం అని ఇంకొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై క్రికెట్ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది.