India vs South Africa: ఢిల్లీలో భారీ వర్షాలు.. నేటి నిర్ణయాత్మక మూడో వన్డే జరిగేనా?

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మూడో వన్డే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచు న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అయితే, ఈ మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. మొదటి వన్డే మ్యాచులో లక్నోలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో మాత్రం భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

India vs South Africa: ఢిల్లీలో భారీ వర్షాలు.. నేటి నిర్ణయాత్మక మూడో వన్డే జరిగేనా?

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మూడో వన్డే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచు న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అయితే, ఈ మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. మొదటి వన్డే మ్యాచులో లక్నోలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో మాత్రం భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

దీంతో 1-1 తేడాలో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. అయితే, మొదటి వన్డే నుంచి వర్షం మ్యాచులకు అడ్డంకి కలిగిస్తూనే ఉంది. దీంతో టాస్ ఆలస్యంగా వేసి, మ్యాచును ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. మూడు రోజుల నుంచి న్యూఢిల్లీలో భారీగా వర్షాలు పడుతున్నాయి.

ఇప్పుడు మూడో వన్డే అసలు ఆలస్యంగానైనా ప్రారంభమవుతుందా? మ్యాచు వర్షాపనం అవుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఢిల్లీలో అక్టోబరులో ఇప్పటికే 121.7 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..