India vs South Africa: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచు ఇవాళ మధ్యాహ్నం 1.30కే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. లక్నోలో జరిగిన మొదటి వన్డే మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోగా, రెండో వన్డేలో విజయం సాధించింది.  నేటి మ్యాచులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది. 

India vs South Africa: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచు ఇవాళ మధ్యాహ్నం 1.30కే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. లక్నోలో జరిగిన మొదటి వన్డే మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోగా, రెండో వన్డేలో విజయం సాధించింది.  నేటి మ్యాచులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది.

దీంతో 1-1 తేడాలో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. నేటి నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. భారత జట్టులో శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, ఇషాంగ్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, షెహ్ బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, అవేశ్ ఖాన్ ఉన్నారు.

కాగా, ఈ చివరి వన్డే మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఢిల్లీలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచు ముగిసిన అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే ఇందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..