India vs South Africa : సెంచూరియన్ టెస్టులో భారత్ ఘన విజయం

113 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.

India vs South Africa : సెంచూరియన్ టెస్టులో భారత్ ఘన విజయం

Test

Team India Centurion Test : సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ శుభారంభం చేసింది. 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 రన్లు సాధించి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా 305 పరుగులు చేయాల్సి వచ్చింది.

Read More : Omicron Variant : ఒమిక్రాన్.. కరోనా వైరస్ లాంటిదే.. ఆందోళన వద్దు.. జాగ్రత్తలు మరువద్దు..!

అనంతరం దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ఆటను ఆరంభించారు. 305 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీలు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 94 పరుగులు చేశారు. 2021, డిసెంబర్ 30వ తేదీ గురువారం లాస్ట్ డే. 211 పరుగులు చేయాలని సౌతాఫ్రికా భావించింది. కానీ భారత బౌలర్లు వారిని కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టానికి సఫారీలు కష్టపడ్డారు.

Read More : DTC Buses Vandalised : కోవిడ్ నిబంధనలపై ఆగ్రహం..బస్సులు ధ్వంసం

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 174 పరుగులకే ఆలౌటైంది. పేసర్లు రబాడ, జాన్సెన్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ 130 పరుగులు కలిపి టీమిండియా మొత్తం 304 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. ఈపిచ్‌పై ఇంతటి స్కోరును గతంలో ఏ జట్లూ ఛేదించలేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 197 పరుగులకు కుప్పకూలింది.

Read More :
 Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!
సెంచూరియన్‌ గ్రౌండ్‌లో అత్యధికంగా 334 బంతులు ఎదుర్కొన్న తొలి విదేశీ ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డు సృష్టించాడు. ఈ వేదికపై ఎక్కువ బంతులు ఆడిన పర్యాటక జట్టు ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌కు చెందిన షాన్‌ మార్ష్‌ 372 బంతులను ఎదుర్కొన్నాడు. ఇక, బుమ్రా మహారాజ్ వికెట్ తో విదేశాల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.

స్కోర్లు : భారత్ 327 & 174, సౌతాఫ్రికా 197 & 191