రబాడ ఫీల్డింగ్‌కు సెటైరికల్ థ్యాంక్స్ చెప్పిన కోహ్లీ

రబాడ ఫీల్డింగ్‌కు సెటైరికల్ థ్యాంక్స్ చెప్పిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా ఫేసర్ కగిసో రబాడ మైదానంలో ఉన్నారంటే కచ్చితంగా ప్రత్యేకత ఉంటుంది. రెండో టెస్టు తొలి రోజులో 
భాగంగా జరిగిన మ్యాచ్‌లో రబాడ చేసిన పొరబాటు కారణంగా అదనంగా నాలుగు పరుగులు వచ్చి చేరాయి టీమిండియాకి. ఫీల్డింగ్‌లో చేసిన తప్పు వల్లనే ఇలా జరగడంతో కోహ్లీ.. ప్రత్యేకంగా సైగలు చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు. 

పుణెలోని మహారాష్ట్ర స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, భారత్‌లు తలపడుతున్నాయి. 200 పరుగుల వద్ద 65.3వ బంతిని మహారాజ్ వేశాడు. సింగిల్ తీసే ప్రయత్నం చేసిన కోహ్లీ.. రహానెలు పరుగు పూర్తి చేయబోతుండగా స్ట్రైకింగ్ ఎండ్‌లోకి కోహ్లీ చేరుకుంటున్నాడు. ఇంతలో రబాడ అత్యుత్సాహంతో రనౌట్ చేద్దామని బంతి విసిరాడు. అంచనా తప్పి అది కాస్తా ఆఫ్ సైడ్ దిశగా దొర్లుకుంటూపోయింది.

అదనంగా పరుగులు ఇచ్చినందుకు సఫారీ ప్లేయర్లు తలలు పట్టుకుంటుంటే రబాడ విసిరిన బంతి ఫోర్‌కు వెళ్లిందని కోహ్లీ వాళ్లకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది.