Sri Lanka vs India: ఆకలితో అనుభవం లేని కుర్రాళ్లు.. శ్రీలంకతో ఫస్ట్ వన్డేలో గెలిచేనా?!

భారత జట్టులో ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ లేనప్పటికీ, టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్ళు బాగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ చక్కని అవకాశం శ్రీలంకతో పర్యటనలో వస్తుంది.

Sri Lanka vs India: ఆకలితో అనుభవం లేని కుర్రాళ్లు.. శ్రీలంకతో ఫస్ట్ వన్డేలో గెలిచేనా?!

India vs Sri Lanka 1st ODI match between Sri Lanka and India will begin at 3:00 pm IST

Sri Lanka vs India, 1st ODI: భారత జట్టులో ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ లేనప్పటికీ, టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్ళు బాగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ చక్కని అవకాశం శ్రీలంకతో పర్యటనలో వస్తుంది. శ్రీలంకతో ఆరు మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో మూడు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు. ఆదివారం(18 జులై 2021) జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది.

ఈ పర్యటనలో, భారత్ కొత్తగా ధావన్ కెప్టెన్‌గా జట్టును శ్రీలంకకు పంపింది. ఈ సిరీస్‌లో కొత్త ఆటగాళ్ల కలయికను చూడవచ్చు. శ్రీలంక జట్టులో కోవిడ్-19 కేసుల కారణంగా ఈ సిరీస్ ఐదు రోజుల ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నారు. దాసున్ షానకా శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ధనంజయ్ డి సిల్వా మరియు పేసర్ దుష్మంత్ చమీరాను మినహాయించి, శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టుకు కఠినమైన సవాలు ఇవ్వగలవారు ఎవరూ శ్రీలంక జట్టులో లేరు.

బలహీనపడ్డ శ్రీలంక: ఇంగ్లాండ్ పర్యటనలో బయో-బబుల్ ఉల్లంఘన కారణంగా కుశల్ మెండిస్ మరియు నిరోషన్ డిక్వెల్లాను సస్పెండ్ చేయగా.. మాజీ కెప్టెన్ కుశాల్ పెరెరా గాయం కారణంగా ఆడట్లేదు. దీంతో శ్రీలంక జట్టు బలహీనంగా కనిపిస్తోంది. పేలవమైన ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భారత్‌పై శ్రీలంక గెలిస్తే మాత్రం అది వింతగానే చెప్పుకొవచ్చు.

భారత జట్టులోని పృథ్వీ షా, ధావన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో కచ్చితంగా చోటు ఉంటుంది. దేవదత్ పాడికల్, రుతురాజ్ గైక్వాడ్ మూడవ స్థానానికి పోటీదారులు. సూర్యకుమార్ యాదవ్ షాట్-మేకింగ్ సామర్ధ్యంపై విశ్వాసం ఉందా? అనేది చూడాలి, మనీష్ పాండేకి నిలకడ చూపించడానికి అవకాశం దక్కవచ్చు. కృష్ణప్ప గౌతమ్ ఆఫ్-స్పిన్ విభాగంలో ఉన్నాడు. అయితే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ క్రునాల్ పాండ్యా కంటే అతనికి ప్రాధాన్యత లభిస్తుందో లేదో చూడాలి. లెగ్ స్పిన్నర్ స్థానం కోసం రాహుల్ చాహర్, యుజ్వేంద్ర సింగ్ చాహల్ మధ్య పోటీ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇషాన్ కిషన్, సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్ కోసం పోటీదారులుగా ఉన్నారు. భారత జట్టులో ఇంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ఆరుగురు ఆటగాళ్ళు ఇప్పుడు ఈ టూర్‌లో ఉన్నారు, కానీ ఈ పర్యటనలో ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వడం కష్టమని ద్రవిడ్ ఇప్పటికే స్పష్టం చేశారు. కొత్త ఆటగాళ్లలో, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరియు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చేతన్ సకారియా టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం పోటీ పడే అవకాశం ఉంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగబోయే ప్రపంచ కప్ జట్టులో ధావన్‌కు చోటు దక్కడం లేదు, ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లుగా ఉంటారు. ధావన్ టాప్ ఆర్డర్‌లో మాత్రమే బ్యాటింగ్ చేయగలడు ఈ టూర్‌లో ధావన్ తనను తాను నిరూపించుకుంటే ఛాన్స్ దక్కవచ్చు. భువనేశ్వర్ టీ20 జట్టులో జస్ప్రీత్ బుమ్రాతో పాటు ప్రధాన బౌలర్‌గా ఉండగలను అని నిరూపించుకోవడానికి ఓ అవకాశంగా భావిస్తున్నారు.

రేపు(18 జులై 2021) మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఫస్ట్ వన్డే మ్యాచ్‌ స్టార్ట్ కాబోతుంది.

జట్లు:
భారత జట్టు(Likely XI): Shikhar Dhawan (c), Prithvi Shaw, Manish Pandey, Suryakumar Yadav, Ishan Kishan (wk), Hardik Pandya, Krunal Pandya, Bhuvneshwar Kumar, Kuldeep Yadav, Chetan Sakariya, Yuzvendra Chahal
శ్రీలంక(Likely XI): Avishka Fernando, Minod Bhanuka (wk), Patthum Nissanka, Dhananjaya de Silva, Bhanuka Rajapaksa, Wanindu Hasaranga, Dasun Shanaka, Chamika Karunaratne, Akila Dhananjaya, Dushmantha Chameera, Lakshan Sandakan