India vs Sri Lanka: టీమిండియా టార్గెట్ 263పరుగులు

భారత్, శ్రీలంక జట్లు మధ్య మూడు వన్డే సిరీస్‌లు జరగుతుండగా.. మొదటి మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 262పరుగులు చేసింది. టీం ఇండియా 263పరుగుల లక్ష్యాన్ని సాధించింది.

India vs Sri Lanka: టీమిండియా టార్గెట్ 263పరుగులు

Match

India vs Sri Lanka 1st ODI: భారత్, శ్రీలంక జట్లు మధ్య మూడు వన్డే సిరీస్‌లు జరగుతుండగా.. మొదటి మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 262పరుగులు చేసింది. టీం ఇండియా 263పరుగుల లక్ష్యాన్ని సాధించింది.

తొలి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. టీమ్‌ఇండియా ముందు మంచి స్కోరే నిర్దేశించింది. మొత్తం 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. చివర్లో టెయిలెండర్లు కరుణరత్నె(43) కాస్త మెరుగ్గా రాణించగా స్కోరు బోర్డు గౌరవప్రదంగా ముగిసింది. కెప్టెన్‌ దాసున్‌ షనక(39), అసలంక (38) నిలకడగా రాణించడంతో ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (32), మినోద్‌ భానుక(27) సైతం శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు.

ఈ క్రమంలోనే చాహల్‌ బౌలింగ్‌లో ఫెర్నాండో మనీశ్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై కుల్‌దీప్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ భానుక రాజపక్సే(24), మరో ఓపెనర్‌ మినోద్‌ భానుకను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ పంపాడు. తర్వాత ధనుంజయ డి సిల్వను(14) కృనాల్‌ పాండ్య బోల్తా కొట్టించాడు.

అప్పటికి లంక స్కోర్‌ 25 ఓవర్లకు 117/4గా నమోదైంది. ఆ తర్వాత అసలంక, షనక ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఆఖరిలో భారత బౌలర్లు పట్టు కోల్పోవడంతో టెయిలెండర్లు ధాటిగా ఆడారు. దాంతో టీమ్‌ఇండియా లక్ష్యం 263 పరుగులుగా నమోదైంది.

భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌ తలో రెండు వికెట్లు తీయగా కృనాల్‌, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ పడగొట్టారు.

టీం ఇండియా ప్లేయింగ్:
శిఖర్ ధావన్ (సి), పృథ్వీ షా, ఇషాన్ కిషన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక ప్లేయింగ్:
అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (డబ్ల్యూ), భానుకా రాజపక్సే, ధనంజయ్ డి సిల్వా, చరిత్ అస్లాంకా, దాసున్ షానక (సి), వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, ఇసురు ఉదనా, దుస్మంత చమీరా, లక్ష్మణ్ సంకకన్