IND vs SL: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్‌దే విజయం.. మ్యాచ్‌ని తిప్పేసిన దీపక్ చాహర్

శ్రీలంక టూర్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డే మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.

IND vs SL: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్‌దే విజయం.. మ్యాచ్‌ని తిప్పేసిన దీపక్ చాహర్

Sr Ind

IND vs SL: శ్రీలంక టూర్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డే మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. భారత విజయంలో దీపక్ చాహర్ (69 నాటౌట్, 82 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్స్), భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్, 28 బంతులు, 2 ఫోర్లు) ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 84 పరుగులు సాధించగా.. ఓడిపోయే మ్యాచ్‌ను భారత్ గెలవగలిగింది.

ఈ మ్యాచ్ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చాహర్‌, భువనేశ్వర్‌ల ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఫస్ట్ వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించగా.. రెండో మ్యాచ్‌లో మాత్రం, తొలి మ్యాచ్‌లా కాకుండా, ఆతిథ్య జట్టు ప్రశంసనీయమైన ప్రదర్శనతో విజయానికి దారి తీసింది, అయితే చాహర్, భువనేశ్వర్ బ్యాట్‌తో కూడా రాణించడంతో విజయాన్ని అందుకోలేకపోయింది శ్రీలంక.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 276 పరుగుల ఛాలెంజింగ్ లక్ష్యాన్ని ఇచ్చి, ఆపై 193 పరుగులకే ఏడు వికెట్లనే పడగొట్టింది, కానీ, దీని తర్వాత తన మొదటి అర్ధ సెంచరీ సాధించిన చాహర్ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 84 పరుగుల భాగస్వామ్యం పంచుకున్నాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. భారత్ ఏడు వికెట్లకు 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది.

భారత్ తరఫున చాహర్ కాకుండా, రెండవ వన్డే ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ 53 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇది అతని మొదటి హాఫ్ సెంచరీ. ఇవే కాకుండా, మనీష్ పాండే 37, క్రునాల్ పాండ్యా 35 పరుగులు జోడించారు. అదే సమయంలో కెప్టెన్ శిఖర్ ధావన్ 29 పరుగులు చేశారు. శ్రీలంక తరఫున వనిందు హసరంగ మూడు వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో తొమ్మిదికి 275 పరుగులు చేసింది. టాస్ గెలిచిన తరువాత చరిత్ అసలాంకా (65 పరుగులు), అవిష్కా ఫెర్నాండో (50 పరుగులు) లతో అద్భుతమైన ఇన్నింగ్స్ చేశారు. భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు.