IND vs SL : వన్డేలో ఐదుగురు ప్లేయ‌ర్స్‌కు ఛాన్స్

టీమిండియా, శ్రీలకం జట్ల మధ్య కొలంబోలో మూడో వన్డే జరుగుతోంది. ఇప్పటికే 2-0 సిరీస్ దక్కించుకున్న టీమిండియా మూడో వన్డేను కూడా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. క్లీన్ స్వీప్ చేయాలని భారత క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే..ఆఖరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక టీం భావిస్తోంది.

IND vs SL : వన్డేలో ఐదుగురు ప్లేయ‌ర్స్‌కు ఛాన్స్

Cricket

India vs Sri Lanka ODI : టీమిండియా, శ్రీలకం జట్ల మధ్య కొలంబోలో మూడో వన్డే జరుగుతోంది. ఇప్పటికే 2-0 సిరీస్ దక్కించుకున్న టీమిండియా మూడో వన్డేను కూడా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. క్లీన్ స్వీప్ చేయాలని భారత క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే..ఆఖరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక టీం భావిస్తోంది. ఈ ఫైనల్ పోరుకు టీమిండియా భారీ మార్పులతో రంగంలోకి దిగింది. ఒకే వన్డేలో ఏకంగా ఐదుగురు ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వడం విశేషం.

Read More : Tokyo Olympics 2021..ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న భారత అథెట్లు

ఆరు మార్పులతో రంగంలోకి దిగింది ధావన్ సేన. సంజు శాంసన్, నితీష్ రాణా, కే. గౌతమ్, చేతన్ సకారియా, రాహుల్ చహర్ లకు ఛాన్స్ ఇచ్చారు. వీరందరూ కొత్త ప్లేయర్స్. ఇలా ఒకే మ్యాచ్ లో ఐదుగురు ప్లేయర్స్ ఇండియా తరపున ఆరంగ్రేటం చేయడం ఇది రెండోసారి అంటున్నారు. 1980లో ఒకే వన్డేలో ఐదుగురు కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది టీమిండియా. మళ్లీ 41 ఏళ్ల తర్వాత దానిని రిపీట్ చేసింది. ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్,న దీపక్ చహార్, యజువేంద్ర చహల్, కుల్ దీప్ యాదవ్ లకు విశ్వాంతినిచ్చింది.

Read More : Singapore Covid Infections : సింగపూర్‌ కొత్త కొవిడ్ కేసులలో మూడొంతుల మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే! 

వరుస ఓటములతో శ్రీలంక జట్టు కృంగిపోయింది. మొదటి వన్డేలో తేలిపోయినా..రెండో వన్డేలో గట్టిపోటీనిచ్చారని చెప్పవచ్చు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజార్చుకోవడంతో చివరి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రీజులోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోచ్ మైక్ ఈసారి ఎలా వ్యవహరిస్తారోనని అనుకుంటున్నారు. మొత్తానికి టీ 20 సిరీస్ కు ముందు ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.