India Vs Sri Lanka : పింక్ బాల్ టెస్టులో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్(డే/నైట్) మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. (India Vs Sri Lanka)

India Vs Sri Lanka : పింక్ బాల్ టెస్టులో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

India Vs Sri Lanka

India Vs Sri Lanka : రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్(డే/నైట్) మ్యాచ్ లోనూ భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 238 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ డే నైట్ టెస్టులో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. 447 పరుగుల భారీ లక్ష్యంతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక.. 59.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Mithali Raj: కెప్టెన్సీలో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

సెకండ్ ఇన్నింగ్స్ లో దిముత్ కరుణరత్నె కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కురణరత్నె 174 బంతుల్లో 107 పరుగులు చేశాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. జట్టు ఓటమిని తప్పించలేకపోయాడు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.(India Vs Sri Lanka)

Virat Kohli: డివిలియర్స్ పేరు పిలిచిన అభిమానులు, విరాట్ వెనక్కు చూసి..

ఓవర్ నైట్ స్కోరు 28/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక ఓ దశలో సజావుగానే ఆడుతున్నట్టు కనిపించింది. అయితే, 54 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ ను అశ్విన్ అవుట్ చేయడంతో లంక పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో కుదురుకోకపోవడంతో భారీ ఓటమి తప్పలేదు.

Ind Vs SL Test : శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యం

ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా ఆడిన కెప్టెన్ కరుణరత్నే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతడిని బుమ్రా బౌల్డ్ చేయగా, ఆ తర్వాత కాసేపటికే లంక ఇన్నింగ్స్ కు అశ్విన్ తెరదించాడు.

IND vs SL : రోహిత్ కొట్టిన షాట్‌‌కు ప్రేక్షకుడి ముక్కు పగిలింది..

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 252 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక 109 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. 303/9 స్కోర్ దగ్గర సెకండ్ ఇన్నింగ్స్‌ని భారత్ డిక్లేర్‌ చేసింది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో లంక 208 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్‌ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రేయాస్ అయ్యర్ (67), పంత్ (50) హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. జడేజా 22, రోహిత్ శర్మ 46, విహారి 35, మయాంక్ అగర్వాల్ 22 పరుగులు చేశారు.(India Vs Sri Lanka)

Kapil Dev: ‘నాకు రవీంద్ర జడేజా ఆటంటే ఇష్టం’

తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి శ్రీలంక జట్టు వెన్ను విరిచిన బుమ్రా.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొట్టాడు. మూడు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. మొదటి టెస్టులో జడేజా చెలరేగిపోతే.. రెండో టెస్ట్ లో బుమ్రా ఆధిపత్యం కనిపించింది.

Rishabh Pant: కపిల్ దేవ్ 40ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్ పంత్