కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చిచేరింది. ఈ పరుగులు యంత్రం మరోసారి రెచ్చిపోయి ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ భారత్ కు విజయం కట్టబెట్టాడు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యానికి వచ్చి చేరింది. మంగళవారం జరిగినే గేమ్ లో కోహ్లీ 17బంతుల్లో 30పరుగులు చేశాడు. 

దీంతో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు. కేవలం 30ఇన్నింగ్స్ లలోనే ఈ రికార్డు సాధించడం గమనార్హం. ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో ధోనీ నిలిచాడు. 62గేమ్ లు ఆడిన ధోనీ 1112పరుగులు పూర్తి చేయగలిగాడు. 

ఇక ఫాఫ్ డుప్లెసిస్(40ఇన్నింగ్స్ లో 1273పరుగులు), కేన్ విలియమ్సన్ (39ఇన్నింగ్స్ లో 1083 పరుగులు), ఇయోన్ మోర్గాన్(43ఇన్నింగ్స్ లో 1013పరుగులు), ఐర్లాండ్ ప్లేయర్ విలియమ్ పోర్టర్ ఫీల్డ్ (56ఇన్నింగ్స్ లో 1006పరుగులు) చేయగలిగారు. 

ఈ పరుగులు సాధించడంలో కోహ్లీ 8హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో పాటు రోహిత్ శర్మతో పాటు సమంగా ఉన్న కోహ్లీ.. 30పరుగులు చేసి రోహిట్ ను దాటేశాడు. 71ఇన్నింగ్స్ లో 24హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ రికార్డును తుడిచిపెట్టేశాడు.