భజ్జీని దింపేశాడు: ఇండోర్‌లో కోహ్లీ వెటకారాలు

10TV Telugu News

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇమిటేటింగ్‌లోనూ తక్కువేం కాదు. ఇండోర్ వేదికగా శ్రీలంకతో రెండో టీ20కు ముందు ఫన్నీ యాక్షన్‌తో నవ్వులు తెప్పించాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ ను దింపేశాడు. పైగా ఈ ఇమిటేషన్ భజ్జీ ఎదురుగానే చేశాడు. భజ్జీ, ఇర్ఫాన్ పఠాన్‌ల ముందు చేయగా భజ్జీ స్వయంగా బాగా చేశాడంటూ మెచ్చుకున్నాడు. 

మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. అస్సాంలోని గువాహటి వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా మూడు టీ20ల సిరీస్ లో 1-0తో ఆధిక్యం సాధించింది. మూడో టీ20ని శుక్రవారం పూణె వేదికగా ఆడనున్నారు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ తీసుకుని లంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. లంకను 142 పరుగులకే కట్టడి చేసి.. లక్ష్య చేధనలో ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది భారత్. మ్యాచ్ మొత్తంలో కోహ్లీ(30 నాటౌట్), కేఎల్ రాహుల్(32) మ్యాచ్ కు హైలెట్ అయ్యాయి.