సిరీస్ నీదా నాదా: తుదిపోరుకు సిద్ధమైన భారత్ vs విండీస్

సిరీస్ నీదా నాదా: తుదిపోరుకు సిద్ధమైన భారత్ vs విండీస్

భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్‌కు.. కోహ్లీసేనకు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం.. మూడో టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ ను ఆడేయనున్నారు. బుధవారం నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే వేదిక కానుంది. ఈ సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ కనిపిస్తుంది. తొలి మ్యాచ్‌లో కోహ్లీ జట్టుకు విజయం తీసుకురాగలిగాడు. రెండో మ్యాచ్‌లో పరాజయం తప్పలేదు. 

హిట్టర్లతో నిండిన కరీబియన్‌ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన పతాక స్థాయిలో ఆత్మవిశ్వాసం కనబరుస్తుంది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు బౌలర్లకు ముప్పు తప్పదు. వాంఖడేలో వారి ధాటిని తట్టుకుని కోహ్లీసేన ఎలా మ్యాచ్‌ను సొంతం చేసుకుంటుందో చూడాల్సిందే.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పొలార్డ్‌కు వాంఖడే స్టేడియం బాగా అలవాటైన పిచ్. విండీస్‌కు కెప్టెన్‌గా ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. లూయిస్‌, సిమన్స్‌, హెట్‌మయర్‌, పొలార్డ్‌, పూరన్‌.. బ్యాటింగ్‌ ఆర్డర్‌ హిట్టర్లతో నిండి ఉంది. గత మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లను విలియమ్స్‌, హేడెన్‌ వాల్ష్‌లను భారత బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్త పడాల్సి ఉంది. 
 
వాంఖడెలో కోహ్లీసేన చురుకుదనం ప్రదర్శించి క్యాచ్ లు జారవిడవడాలు తగ్గించి, ఫీల్డింగ్ లోపాలు సరిచేసుకోవాలి. బౌలింగ్‌ గాడి తప్పడం కూడా ఆందోళన కలిగిస్తునన విషయమే. భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌ అసలేమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. స్పిన్నర్ల ప్రదర్శనలోనూ నిలకడ లేదు. బ్యాట్స్‌మెన్‌ నుంచి సమష్ట ప్రదర్శన కొరవడింది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. సొంత మైదానమైన వాంఖడెలో అయినా రోహిత్‌ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడతాడేమో చూడాలి. గత మ్యాచ్‌లో సత్తా చాటుకున్న శివమ్‌ దూబెకు కూడా వాంఖడె సొంతగడ్డే. 

వాంఖడె పిచ్‌ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. బుధవారం కూడా అందుకు భిన్నంగా లేకపోతే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. 

పంత్ విఫలమవుతోన్న వేళ:
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆశించనంత మేర ప్రదర్శన ఇవ్వకపోతుండటంతో శాంసన్ ను తీసుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. గత రెండు మ్యాచ్ లలోనూ బెంచ్ కే పరిమితమైన శాంసన్ తుది జట్టులో స్థానం దక్కించుకుంటాడాననే సందేహాలు మొదలయ్యాయి. బౌలింగ్‌లో విఫలమవుతూనే.. ఫీల్డింగ్‌లో తేలిపోతున్న వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించేటట్లుగా టీమిండియా మేనేజ్‌మెంట్ కనిపిస్తోంది. 

జట్ల అంచనా:
భారత్: Rohit, Rahul, Kohli (C), Samson/Iyer, Pant (WK), Pandey/Jadeja, Dube, Sundar, Kuldeep, Shami, Bhuvneshwar

వెస్టిండీస్: Lewis, Simmons, King, Hetmyer, Pooran (WK), Pollard (C), Holder, Pierre/Paul, Cottrell, Williams and Walsh.