ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్

నాల్గో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టుపై 25 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్

India win Test series against England qualify for WTC final : నాల్గో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టుపై 25 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలిచింది. భారత బౌలర్ల స్పిన్ దెబ్బకు ఇంగ్లాండ్ గజగజలాడింది. ఐదు వికెట్లతో అక్షర్ పటేల్, అశ్విన్ చెలరేగడంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్లింది. మూడు రోజుల్లోనే నాల్గో టెస్టు ముగిసింది. నాలుగు టెస్టుల సిరీస్ ను 3-1తేడాతో కోహ్లీసేన కైవసం చేసుకుంది.


భారత బ్యాట్స్‌మెన్ రాణించిన పిచ్ పై ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలింది. నాల్గో టెస్టులోనూ భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టేశారు. ఆరంభ టెస్ట్ సిరీస్ లోనే అక్షర్ పటేల్ 27 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ గెలవడంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. జూన్ 18-22 మధ్య లార్డ్స్ లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.


మరోవైపు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఎంఆర్ఎఫ్ వరల్డ్ వైడ్ ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది.