India vs Bangladesh: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు

బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలవగా, చటేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు.

India vs Bangladesh: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకా (మీర్పూర్) వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, ఆదివారం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ త్వరగానే మరో మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ 314 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ ఇండియాకు 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, శనివారం 145 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 7 పరుగులకు ఔట్ కాగా, కేఎల్ రాహుల్ 2 పరుగులు చేసి వెను దిరిగాడు. తర్వాత చటేశ్వర్ పుజారా 6 పరుగులు, విరాట్ కోహ్లీ 1 పరుగు చేసి ఔటయ్యారు.

PAN-Aadhaar: మార్చి 31లోపు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ రద్దు.. ఐటీ శాఖ చివరి హెచ్చరిక

అనంతరం అక్షర్ పటేల్ 34 పరుగులు, జయదేవ్ ఉనాద్కత్ 13 పరుగులు, రిషబ్ పంత్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో టీమిండియా 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్, రవి చంద్రన్ బాధ్యతగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. ఇద్దరూ కలిసి వికెట్ కోల్పోకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రేయస్ అయ్యర్ 29 పరుగులతో, రవిచంద్రన్ అశ్విన్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లక్ష్యాన్ని చేధించారు. దీంతో భారత్ 47 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 145 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ ఐదు వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలవగా, చటేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు.