Zimbabwe vs India: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌

భారత్-జింబాబ్వే క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచుల సిరీస్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హూడా, సంజూ శాంసన్‌ (వికెట్ కీపర్), అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌ ఉన్నారు. జింబాబ్వేలోని హరారె స్పోర్ట్స్ క్లబ్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు.

Zimbabwe vs India: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌

Zimbabwe vs India

Zimbabwe vs India: భారత్-జింబాబ్వే క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచుల సిరీస్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హూడా, సంజూ శాంసన్‌ (వికెట్ కీపర్), అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌ ఉన్నారు. జింబాబ్వేలోని హరారె స్పోర్ట్స్ క్లబ్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. తాను 2 నెలలుగా ఆటకు దూరమైనప్పటికీ టీమ్, దేశం కోసం గతంలో చేసిన దాన్ని మర్చిపోలేదని చెప్పాడు.

కరోనాతో పాటు స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీతో రెండు నెలలుగా కేఎల్ రాహుల్‌ ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాహుల్ ఎలా ఆడతాడన్న విషయంపై అందరి దృష్టి ఉంది. కెప్టెన్ గా జట్టును నడిపించడంతో పాటు అతడు టాప్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. చిన్న జట్టు జింబాబ్వేపై మూడు మ్యాచులూ గెలిచి క్లీన్ స్వీప్ చేయడంపైనే భారత్ దృష్టి సారించింది. అయితే, జింబాబ్వే చిన్న జట్టయినా తక్కువగా అంచనా వేయొద్దని భారత్ భావిస్తోంది. జింబాబ్వే ఓపెనర్లుగా క్రీజులోకి కయియా, మరుమణి వచ్చారు.
భారత జట్టు..