INDvAUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

INDvAUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

నెల రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ముగ్గురు కీపర్లతో బరిలోకి దిగుతున్న భారత్ ఏ మాత్రం మెరుపులు సృష్టించగలదో చూడాలి. రిషబ్ పంత్, ఎంఎస్ దోనీ, దినేశ్ కార్తీక్‌లు జట్టులో స్థానం దక్కించుకున్నారు. 

మ్యాచ్ ఆరంభమవడానికి కొద్ది నిమిషాల వరకూ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ప్రాక్టీసు చేస్తూనే కనిపించాడు. మరోవైపు జట్టులో కీలక మార్పులు చేపట్టిన ఆస్ట్రేలియా టీమిండియాపై విజయం సాధించాలని తహతహలాడుతోంది. 

పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్ ఏ ఈవెంట్ చేయాలన్నా మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్.. పాక్ జట్టుతో తలపడొద్దంటూ పలు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడతారేమోనన్న అనుమానంతో వైజాగ్‌లో భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ మేర నగరమంతటా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ మహేశ్ చంద్ర తెలిపారు. 

‘ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తాం. మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్లు ఫ్లకార్డ్స్ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తాం. హెల్మెట్, లగేజ్ బ్యాగ్, స్టిక్స్ లాంటి వస్తువులు ఏమైనా స్టేడియం బయటే వదిలేయాలి. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలని వాహనాల్ని బీచ్‌రోడ్‌వైపు మళ్లిస్తున్నాం’ అని వివరించారు. 

టీమిండియా:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, మయాంక్ మార్కండే, బుమ్రా

ఆస్ట్రేలియా: 
ఆరోన్ ఫించ్, షార్ట్, స్టోనిస్, మాక్స్‌వెల్, హ్యాండ్స్ కాంబ్, టర్నర్, నైల్, కమిన్స్, రిచర్డ్ సన్, బెహ్రెండఫ్, జంపా