Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టేయనున్న ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ భరత్ పన్ను

ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ భరత్ పన్ను పేరిట ఇప్పటికే రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఉండగా.. మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టేయనున్న ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ భరత్ పన్ను

Bharath Pannu

Guinness World Record: ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ భరత్ పన్ను పేరిట ఇప్పటికే రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఉండగా.. మరో రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. సోలో సైకిలింగ్ లో లేహ్ నుంచి మనాలి వరకూ 35గంటల 32నిమిషాల 22సెకన్లలో 472కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అతని రెండో రికార్డ్ 5వేల 942 కిలోమీటర్లు పొడవైన గోల్డెన్ చతుర్భుజాకార రూట్ అయిన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలు ప్రయాణించాడు.

ఇప్పుడేమో.. 3వేల 750కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది రోజుల్లో కోటీశ్వర్, గుజరాత్, కిబితో, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను చుట్టేయనున్నారు. అంతా అనుకున్నట్లుగానే జరిగితే మరో రికార్డ్ సొంతమైనట్లే. ఇంతే దూరాన్ని నరేశ్ కుమార్ అనే వ్యక్తి 11రోజుల 21గంటల 57నిమిషాల 2సెకన్లలో పూర్తి చేశారు.

సైకిలింగ్ ఇలాంటి ఫీట్ సాధించడానికి.. సైకిలింగ్ చేయడం వెనుక మోటివేషన్ గురించి అడిగితే.. ‘ ఇది తనకు మెడిటేషన్ లాంటిదని.. ప్రశాంతతను ఇస్తుందని’ చెప్తున్నాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసేందుకు ఇండియన్ ఆర్మీ అందిస్తున్న మోటివేషన్ ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు.

…………………………………….. : కోవిడ్ నిబంధనలు.. 40 లక్షల మందికి జరిమానా విధించిన అధికారులు

ఇండియన్ ఆర్మీలో భాగమైన తనకు.. ఇండియన్ ఆర్మీ నుంచి నిరంతరం సపోర్ట్ అందుతూనే ఉంటుంది. అదే నేను గోల్స్ చేయడానికి మోటివేషన్ గా ఉపయోగపడుతుంది. నాకు అవసరమైన ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ నుంచి ఇలాంటి సపోర్ట్ అందుకుంటున్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నా. ఆ ఆర్గనైజేషన్ లో ఉండటం నా గొప్ప’ అని అన్నారు.

2018 నుంచి అథ్లెట్ గా SCOTT స్పోర్ట్స్ ఇండియా సపోర్ట్ తీసుకుంటున్న భరత్ పన్ను.. రికార్డ్ అటెంప్ట్స్, రేసులు వంటి వాటిలో బోలెడు మెడల్స్ సాధించారు. RAAM 2019 (రేస్ అక్రాస్ అమెరికా) లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత అతని కాలర్ బోన్ విరగడంతో ఇక రేసు నుంచి తప్పుకుంటాడనుకుంటుండగా RAAM 2022లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.