ఇండియన్ బ్యాట్స్ మెన్ బెటరే కానీ స్వార్థపరులు, మేం దేశం కోసం ఆడాం: ఇంజమామ్

  • Published By: chvmurthy ,Published On : April 23, 2020 / 11:06 AM IST
ఇండియన్ బ్యాట్స్ మెన్ బెటరే కానీ స్వార్థపరులు, మేం దేశం కోసం ఆడాం: ఇంజమామ్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య తేడాలను వివాదాస్పదంగా పోల్చి చెప్పారు. పాకిస్తాన్ ప్లేయర్లలో సమైక్యత ఉంటుందని ఇండియన్ ప్లేయర్లు వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతారని విమర్శించారు. 

‘నేను క్రికెట్ ఆడే రోజుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ పేపర్ పై రికార్డు స్థాయిలో ఉండేది. మేం 30 లేదా 40 చేసిన ఒక టీంగా చేసేవాళ్లం. భారత జట్టులో ఒకరు 100కొట్టినా అది జట్టు కోసం కాదు. కేవలం ఒకరి కోసమే. అదే మాకు వాళ్లకు మధ్య తేడా’ రమీజ్ రాజా యూట్యూబ్ చానెల్ లో మాట్లాడుతూ.. ఇంజమామ్ అలా కామెంట్లు చేశారు. 

వ్యక్తిగత రికార్డు కోసం ట్రై చేసే ప్లేయర్లు ఉండటం చాలా ప్రమాదకరం. వారు జట్టు కోసం ఆడరు. వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే చూసుకుంటారు. అతణ్ని ఇమ్రాన్‌ ఖాన్ ఎలా సపోర్ట్ చేసేవాడో గుర్తు చేసుకున్నాడు. అతని పేలవ ప్రదర్శనలు చేసినప్పటికీ ఇంజమామ్‌ను సపోర్ట్ చేశాడట. 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ సాధించడమే జట్టు సమష్ఠి కృషికి నిదర్శనమని చెప్పాడు. 

‘ఇమ్రాన్ ఖాన్ టెక్నికల్ గా పెద్ద కెప్టెన్ ఏం కాదు. కానీ, ప్లేయర్ల నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా రాబట్టాలో తెలుసు. యువ ఆటగాళ్లకు మంచి ప్రోత్సాహం ఇచ్చేవాడు. ప్లేయర్ల మీద నమ్మకం ఉంచడమే అతణ్ని గొప్ప కెప్టెన్‌గా నిలబెట్టింది’ అని ఇంజమామ్ అన్నాడు.