లారాను దాటేసి టాప్ 10లో చేరిన కోహ్లీ

లారాను దాటేసి టాప్ 10లో చేరిన కోహ్లీ

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ కోహ్లీ పరుగుల వరదకు హద్దూఆపూ లేకుండాపోయింది. దూకుడైన ఇన్నింగ్స్‌తో రెచ్చిపోతున్న విరాట్ అత్యధిక వన్డే పరుగులు సాధించిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే జరగడానికి ముందు వరకూ టాప్ 10వ స్థానంలో ఉన్న బ్రియాన్ లారా స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే నేపియర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 59 బంతులాడి 45(3 ఫోర్లు)పరుగులు చేశాడు. 

289 ఇన్నింగ్స్‌లు ఆడిన లారా 10, 405పరుగులు చేయగా ఆ రికార్డును కోహ్లీ కేవలం 212 ఇన్నింగ్స్‌లలోనే 10430పరుగులు చేసి దాటేశాడు. అత్యధిక వన్డే పరుగులు సాధించిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా ఈ రికార్డు చేరుకోవడానికి 452 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. 

ఇంకా కోహ్లీతో పాటుగా ఈ జాబితాలో ఉన్న భారతీయ క్రికెటర్లలో సౌరవ్ గంగూలీ(11363), రాహుల్ ద్రవిడ్(10889)తో ఉన్నారు.