Rohit Sharma: నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ షాకింగ్ ప్రపోజల్..

ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ సెల్ఫీ తీసుకోవటానికి వచ్చిన వ్యక్తికి పువ్వు ఇచ్చి ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍‌గా మారింది. ఈ వీడియోలో రోహిత్ తీరు నవ్వులు తెప్పిస్తుంది.

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీం సభ్యులతో సరదా వ్యాఖ్యలు చేస్తూ సందడి చేస్తుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ సెల్ఫీ తీసుకోవటానికి వచ్చిన వ్యక్తికి పువ్వు ఇచ్చి ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍‌గా మారింది. ఈ వీడియోలో రోహిత్ తీరు నవ్వులు తెప్పిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రోహిత్ కొంటెతనంపై సరదా కామెంట్లు చేస్తున్నారు.

Rohit Sharma on WTC Final: ఐపీఎల్ తో డబ్య్లూటీసీ విజయావకాశాలు దెబ్బతింటాయా.. ప్రిపరేషన్ పై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

విశాఖ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరిలో అక్షర్ పటేల్ (29) రాణించాడు. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ (13) పరుగులు మాత్రమే చేయగా, నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 118 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేలో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమఉజ్జీలుగా ఉన్నాయి. మూడో వన్డే మ్యాచ్ చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజేత టీంకు సిరీస్ దక్కుతుంది.

 

 

విశాఖ మ్యాచ్‌కు ముందురోజు రోహిత్ శర్మ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో రోహిత్, అతని సిబ్బందికి ఘన స్వాగతం లభించింది. అయితే, ఎయిర్ పోర్టులో రోహిత్ వస్తున్న క్రమంలో ఓ వ్యక్తి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకుంటున్నాడు. రోహిత్ అతని దగ్గరకు రాగానే తన చేతిలో ఉన్న గులాబీని ఇచ్చి ఇది నీకోసమే తీసుకో అంటూ ఇచ్చాడు. ఆ వ్యక్తి సంతోషంతో గులాబీ పువ్వును తీసుకొని థ్యాంక్యూ చెప్పాడు. రోహిత్ వెంటనే.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ నవ్వుకుంటూ ప్రప్రోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రోహిత్ కొంటెంతనంపై సరదా కామెంట్ల చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు