మీకు బుద్ధి ఉందా? : పాక్ మద్దుతుగా కరోనాపై భారత క్రికెటర్ల ప్రచారం.. నెటిజన్లు ఫైర్ 

  • Published By: sreehari ,Published On : April 1, 2020 / 01:06 PM IST
మీకు బుద్ధి ఉందా? : పాక్ మద్దుతుగా కరోనాపై భారత క్రికెటర్ల ప్రచారం.. నెటిజన్లు ఫైర్ 

భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాటం చేయాలంటూ పాకిస్థాన్ కెప్టెన్ షాహీది అఫ్రిది నిర్వహించే సంస్థకు మద్దతుగా నిలిచిన వీరిద్దరిని నెటిజన్లు ఏకిపారేశారు. ఇరుదేశాల ప్రత్యర్థుల్లో ఈ ఇద్దరి చర్యతో భగ్గుమంది.

పాకిస్థాన్ లో ప్రాణాంతక వైరస్ బాధితుల సహాయార్థం విరాళాలు అభ్యర్థిస్తున్న అఫ్రిధికి ఈ ఇద్దరు క్రికెటర్లు మద్దతుగా ప్రచారం చేశారు. హర్భజన్ వీడియో మెసేజ్ ద్వారా విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరాడు. రెండు దేశాల్లోని ఇతర క్రికెటర్లను కూడా ఇలానే కోరాడు. మరోవైపు యువరాజ్ సింగ్ కూడా ట్విట్టర్ వేదికగా అప్రిధికి తన మద్దుతు తెలిపాడు.

ఇవి పరీక్షా కాలం.. ప్రతిఒక్కరూ జాగ్త్రత్తగా ఉండాల్సిన సమయం’ అని యువరాజ్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. తనకు మద్దతుగా ప్రచారం చేసిన యువరాజ్, హర్భజన్‌లకు ప్రత్యర్థి ఆటగాడైన అఫ్రిది ధన్యవాదాలు తెలిపాడు.

యువరాజ్, హర్భజన్ల తీరుపై భారత్ లో ట్విట్టర్ యూజర్లు మండిపడ్డారు.. ‘నీకు ఏమైనా బుద్ధి ఉందా? అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. నీపై ఉన్న గౌరవం పోయిందంటూ భజ్జీని తిట్టిపోశాడు మరో యూజర్. మరొకరు సారీ గాయ్స్.. మీరు కోల్పోయారు.. అని ట్వీట్ చేశారు. 

2012-2013 నుంచి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకూ ద్వైపాక్షిక సిరీస్ జరుగలేదు. వరల్డ్ కప్ విజేత, బ్యాట్స్ మెన్ యువరాజ్, గత ఏడాదిలో క్యాన్సర్ ను జయించి తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు.. తన YouWeCan ఫౌండేషన్ ద్వారా కరోనా వైరస్ సంక్షోభంపై విరాళాలను కూడా కోరాడు. మార్చి 24 నుంచి భారతదేశంలో 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 1,600మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 38 మంది వైరస్ సోకి మృతిచెందారు.
 

పాకిస్థాన్ లో కరోనా బాధితుల కోసం విరాళాలు కోరుతున్న అఫ్రిదికి మద్దుతు తెలపడంపై వస్తున్న విమర్శలపై యువీ స్పందించాడు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఏ తప్పు ఉందో నాకు నిజంగా అర్థం కావడం లేదని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తెలిపాడు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదన్నాడు. నేను ఎప్పుడు భారతీయుడినే.. బ్లూతోనే ఉంటాను.. మానవత్వాన్ని చాటేందుకు ఎల్లప్పడూ నిలబడతా.. జైహింద్ అంటూ యువీ పోస్టు పెట్టాడు.
yuvaraj