Mirabai Chanu : పట్టుదలే ఫలితానిచ్చింది, మీరాబాయి చాను గెలిచింది..

కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం అందించింది మీరాబాయ్ చాను. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించిన మీరాబాయి చానును ప్రధాని ప్రశంసించారు.

Mirabai Chanu : పట్టుదలే ఫలితానిచ్చింది, మీరాబాయి చాను గెలిచింది..

Mirabai Chanu

Indian Medalist Saikhom : కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం అందించింది మీరాబాయ్ చాను. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించిన మీరాబాయి చానును ప్రధాని ప్రశంసించారు. చాను విజయం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమన్నారు. మీరాబాయి చాను వండర్‌ క్రియేట్ చేసింది. ముందుగా చెప్పినట్టే టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ముద్దాడింది.

Read More : Ajay – Mahesh : టాప్ 50లో రెండు ఇండియన్ సినిమాలు..

సిల్వర్ మెడల్ : – 
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిపెట్టింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వర్‌ మెడల్‌ కొట్టి చరిత్ర సృష్టించింది. దేశం మొత్తం గర్వపడేలా చేసింది మీరాబాయి. మహిళల 49 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన మీరా భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి అవతల పారేసిందామే. ఈ కేటగిరీలో చైనా బంగారు పతకాన్ని అందుకుంది.

Read More : Suhana Khan: సుహానా ఫోటోషూట్.. షారుఖ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మణిపూర్ కు చెందిన మీరాబాయ్ :-
మీరాబాయ్ చాను మణిపూర్ కి చెందిన యువతి. ఆమె 1994 ఆగస్ట్ 8వ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఈ రంగంలో ప్రవేశించి చివరకు ఒలింపిక్స్‌లోనే సిల్వర్‌ మెడల్ కొట్టారు. 2017లో అమెరికాలో కాలిఫోర్నియాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొన్న చాను మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 194 కేజీలు బరువు ఎత్తి బంగారు పతకం గెలుచుకొంది.

Read More : Tokyo Olympics : భారత్ కు తొలి పతకం తెచ్చిన మీరాబాయి ఇంట్లో సంబరాలు

పట్టుదలతో కృషి :-
ఇక 2014లో గ్లాస్ గోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను వెండి పతకం సాధించింది. ఆ తరువాత 2016లో జరిగిన రియో ఒలింపిక్ పోటీలలో చాను పాల్గొంది కానీ అప్పుడు విఫలం అయ్యింది. అప్పటి నుంచి మరింత పట్టుదలతో గట్టిగా కృషి చేసి ఈసారి రజత పతకం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనే మరిన్ని పతకాలను గెలుచుకోవడానికి స్ఫూర్తినిచ్చారు చాను. రెండో రోజే ఈ ఘనతను సాధించడంతో మిగిలిన ఆటగాళ్లు, అథ్లెట్లలో పతకాన్ని సాధించాలనే కాంక్షను రగిలించినట్టయింది.