Indian Women Cricket: టీమిండియా మహిళా జట్టుకు ఎదురుదెబ్బ

టీమిండియా మహిళా జట్టుపై భారం పడింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఫైన్ కట్టాల్సి వచ్చింది.

Indian Women Cricket: టీమిండియా మహిళా జట్టుకు ఎదురుదెబ్బ

Teamindia Women

Indian Women Cricket: టీమిండియా మహిళా జట్టుపై భారం పడింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఐసీసీ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం.. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా స్లో ఓవర్ రేట్ నమోదు చేసిందని మ్యాచ్ రిఫరీ ఫిల్ విట్టీకేస్ స్పష్టం చేశారు.

ప్లేయర్లకు, ప్లేయర్ల సపోర్ట్ కు సంబంధించిన ఆర్టికల్ 2.22.. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. మినిమమ్ ఓవర్ రేట్ కంటే తక్కువగా నమోదైతే మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తారని ఐసీసీ చెప్పింది. ఇలా జరిగినందుకు కౌర్ కాస్త అవమానంగా భావిస్తున్నట్లు చెప్పడంతో వినాల్సిన వాదనలేమీ లేకుండా పోయాయి.

ఫీల్డ్ అంపైర్లు ఐయాన్ బ్లాక్ వెల్, పాల్ బాల్డ్ విన్, థర్డ్ అంపైర్ సూ రెడ్ ఫెర్న్.. ఫోర్త్ అంపైర్ రాబిన్‌సన్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.