India vs Sri Lanka: ముగిసిన భారత ఇన్నింగ్స్.. సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ.. శ్రీలంక లక్ష్యం 374 పరుగులు
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.

India vs Sri Lanka: భారత-శ్రీలంక జట్ల మధ్య, గౌహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది.
West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము.. అన్నం తిన్న పలువురు విద్యార్థులకు అస్వస్థత
దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 70 పరుగులు చేసి ఔట్ కాగా, రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. తర్వాత విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ సెంచరీ సాధించాడు. 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ, 87 బంతుల్లో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 28 పరుగులు, కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 39 పరుగులు, హార్థిక్ పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులు, అక్షర్ పటేల్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యారు.
భారత ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మహ్మద్ షమి 4 పరుగులతో, మహ్మద్ సిరాజ్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో రాజిత 3 వికెట్లు తీయగా, దిల్షాన్ మధుశంక, కరుణరత్నే, షనాక, ధనుంజయ డి సిల్వా తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా కోహ్లీ వన్డేల్లో 45వ సెంచరీ నమోదు చేశాడు. స్వదేశంలో అతడికిది 20వ సెంచరీ. గతంలో ఇండియాలో 20 సెంచరీలు సాధించిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు.
2019 తర్వాత కోహ్లీ స్వదేశంలో సెంచరీ చేయడం మరో ప్రత్యేకత. తర్వాత 374 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లంక 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 12 బంతుల్లో 5 పరుగులే చేసి, మహ్మాద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.