IND vs AUS 2nd ODI: నేటి వైజాగ్ వన్డేలో వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్?

తొలి మ్యాచులో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. నేటి మ్యాచులో అతడిని తీసుకుంటారా? లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్యాచులో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు, రవీంద్ర జడేజాకు 2, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

IND vs AUS 2nd ODI: నేటి వైజాగ్ వన్డేలో వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్?

IND vs AUS 2nd ODI

IND vs AUS 2nd ODI: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య విశాఖలో నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ కు చోటు దక్కుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. టీమిండియా వన్డే స్క్వాడ్ లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, చాహెల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.

తొలి వన్డే మ్యాచుకు దూరమైన రోహిత్ నేటి మ్యాచులో ఆడనున్నాడు. తొలి మ్యాచులో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. నేటి మ్యాచులో అతడిని తీసుకుంటారా? లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్యాచులో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు, రవీంద్ర జడేజాకు 2, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

అలాగే, తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. నేటి మ్యాచులో అతడిని పక్కనబెట్టి వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చే వీలు ఉంది. అయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం ఈ మార్పునకు సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఇక తొలి వన్డేలో 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 91 బంతుల్లో 75 పరుగులు చేసి టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్ నేటి మ్యాచ్ లోనూ మిడిల్ ఆర్డర్ లో తన స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తొలి వన్డేలో టీమిండియా 39.5 ఓవర్లలో 191 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

WPL 2023: మరో వారం రోజుల్లో డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్లు టాప్ లో ఉన్నాయి?