Youngest Cricketer: టెన్త్ క్లాస్ పరీక్షల్లో పాసైన స్టార్ క్రికెటర్.. 52శాతం మార్కులతో!

భారత మహిళా క్రికెట్ జట్టు యంగ్ సెన్సేషన్, ఓపెనర్ బ్యాట్స్‌ ఉమెన్ షెఫాలి వర్మ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.

Youngest Cricketer: టెన్త్ క్లాస్ పరీక్షల్లో పాసైన స్టార్ క్రికెటర్.. 52శాతం మార్కులతో!

Shafali Verma

Shafali Verma: భారత మహిళా క్రికెట్ జట్టు యంగ్ సెన్సేషన్, ఓపెనర్ బ్యాట్స్‌ ఉమెన్ షెఫాలి వర్మ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. గురువారం, 10వ తరగతి ఓపెన్ పరీక్ష ఫలితాలను హర్యానా బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించగా.. అందులో షెఫాలి వర్మ 52 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. నిరంతరం క్రికెట్‌లో ప్రాక్టీస్ చేస్తూ రాణించే షెఫాలి వర్మ పరీక్షల్లో పాస్ అవడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పదవ తరగతి ఓపెన్ పరీక్షల ఫలితాన్ని హర్యానా బోర్డు గురువారం ప్రకటించగా.. షెఫాలి వర్మ పాస్ అయ్యినట్లుగా తండ్రి సంజీవ్ వర్మ తెలిపారు. షెఫాలి వర్మకు 52 శాతం మార్కులు వచ్చాయి. 17 ఏళ్ల షెఫాలి వర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. ఆమె తండ్రి సంజీవ్.. కుమార్తెకు ఈ విషయాన్ని తెలియజేశారు. మార్చిలో షెఫాలి వర్మ 10వ తరగతి ఓపెన్ పరీక్షలు రాశారు.

బోర్డు ఛైర్మన్ షెఫాలి వర్మను అభినందించారు. భారత మహిళా క్రికెట్ జట్టులో నంబర్ వన్ క్రీడాకారిణి అయిన షెఫాలి వర్మ 52శాతం మార్కులతో ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు హర్యానా బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గర్వంగా ఉంతన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ బాగా బ్యాటింగ్ చేసిన ఆమె, తొలి టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించింది.

2004 జనవరి 28న పుట్టిన షెఫాలీ వర్మ భారతీయ మహిళా క్రికెట్ జట్టులో చేరి అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ ఆడిన క్రికెటర్. 16 ఏళ్ల వయసులోనే సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును 30 ఏళ్ల తర్వాత షెఫాలీ బద్దలు కొట్టింది. కేవలం 15ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చిన్నవయస్సులోనే షెఫాలి వర్మ స్టార్ క్రికెటర్‌గా ఎదిగారు.