బెంగళూరులో డూ ఆర్ డై : రెండో టీ20కి రె‘ఢీ’

బెంగళూరులో డూ ఆర్ డై : రెండో టీ20కి రె‘ఢీ’

భారత్-ఆస్ట్రేలియాల మధ్య అత్యంత ఆసక్తివంతమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను వైజాగ్ వేదికగా ఆడిన ఇరు జట్లు రెండో మ్యాచ్‌ను బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా ఆడేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే బెంగళూరు చేరుకుని ప్రాక్టీసును ముమ్మరం చేశాయి. తొలి టీ20లో అనూహ్యంగా విజయం ముంగిట వరకూ వచ్చిన భారత్‌కు ఆఖరి ఓవర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

ఆఖరి మ్యాచ్‌లో ఓడినప్పటికీ రెండో టీ20లో భారత్ యే ఫేవరేట్ గా కనిపిస్తోంది. బ్యాటింగ్ కు బాగా అనుకూలించే పిచ్ పై బౌలర్లు సత్తా చాటాల్సి ఉంది. ప్రతి మ్యాచ్‌లోనూ మార్పులకు అవకాశమిచ్చే కోహ్లీ రెండో టీ20లో జట్టు మారుస్తాడా లేదా అని వేచి చూడాలి. అంతకుముందు తొలి టీ20లో అవకాశాన్ని అందిపుచ్చుకుని 35బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది పరవాలేదనిపించుకున్నాడు కేఎల్ రాహుల్.
Also Read : యుద్ధం చేయలేక కాదు: బలహీనులం కాదంటోన్న సచిన్

ఇక టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏ విభాగంలోనూ మెరుగు అనిపించలేదు. పైగా విమర్శలు అదే స్థాయిలో అందుకున్నాడు. మ్యాచ్ చివరి వరకూ క్రీజులో ఉన్నప్పటికీ సంతృప్తికర ప్రదర్శన చేయలేకపోయాడు. ఆఖరి ఓవర్ బౌలింగ్ తీసుకుని ఆస్ట్రేలియాకు మ్యాచ్ అప్పగించిన ఉమేశ్ యాదవ్‌కు బదులు సిద్ధార్థ్ కౌల్ కు అవకాశమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

చాహల్, మయాంక్ మార్కండే, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు మాత్రం యథాస్థానంలో కొనసాగుతారు. 

జట్ల అంచనా:
భారత్:

శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్/విజయ్ శంకర్, కృనాల్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, మయాంక్ మార్కండే

ఆస్ట్రేలియా:
మార్కస్ స్టోనిస్, డార్సీ షార్ట్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్ వెల్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్(వికెట్ కీపర్), ఆష్టన్ టర్నర్, నాథన్ కౌల్టర్ నైల్, పాట్ కమిన్స్, రిచర్డ్‌సన్, జాసన్ బహ్రెన్‌డాఫ్, ఆడం జంపా
Also Read : సెక్యూరిటీ బర్త్ డే సెలబ్రేట్ చేసిన విరాట్ కోహ్లీ