కోహ్లీ, విజయ్‌లు మ్యాచ్‌‌ను ఇలాగే గెలిచారా?

నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా ఆస్ట్రేలియాపై భారత్ గెలిచినప్పటికీ ఆసీస్ కంటే వెనుకంజలోనే ఉంది. అదేంటంటే టీమిండియా ఈ మ్యాచ్ 500వన్డే విజయాలను నమోదు చేసుకుంది.

కోహ్లీ, విజయ్‌లు మ్యాచ్‌‌ను ఇలాగే గెలిచారా?

నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా ఆస్ట్రేలియాపై భారత్ గెలిచినప్పటికీ ఆసీస్ కంటే వెనుకంజలోనే ఉంది. అదేంటంటే టీమిండియా ఈ మ్యాచ్ 500వన్డే విజయాలను నమోదు చేసుకుంది.

నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా ఆస్ట్రేలియాపై భారత్ గెలిచినప్పటికీ ఆసీస్ కంటే వెనుకంజలోనే ఉంది. అదేంటంటే టీమిండియా ఈ మ్యాచ్ 500వన్డే విజయాలను నమోదు చేసుకుంది. ఇలా అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్లలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంటే రెండో స్థానంలో భారత్ ఉందన్నమాట. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్‌కు 251పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

చేధనకు దిగిన ఆసీస్.. ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. ఆఖరి ఓవర్లో విజయం అందుకోవడంతో అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. చివరి ఓవర్ బౌలింగ్ వేసిన విజయ్ శంకర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మ్యాచ్ అనంతరం చాహల్ మైక్ తీసుకుని రెడీ అయిపోయాడు. చాహల్ టీవీ అంటూ ఈ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్లతో ముచ్చటిస్తున్న చాహల్.. కోహ్లీ, విజయ్‌శంకర్‌లతో తమ అభిప్రాయాలను పంచుకున్నాడు. 
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే

కోహ్లీ మాట్లాడుతూ.. ఫైనల్ ఓవర్ బౌలింగ్ ఎవరికీ ఇవ్వాలానని చర్చించాం. ఓ స్పిన్నర్‌కు అవకాశమిస్తే.. సిక్సు బౌండరీ కొట్టే అవకాశాలున్నాయి. అదే ఫాస్ట్ బౌలర్ రివర్స్ స్వింగ్ వేస్తే కాస్త అదుపు చేయగలం. అందుకే విజయ్ శంకర్‌ను మా చాయిస్‌గా ఎంచుకున్నాం. తొలి బంతిని కరెక్ట్‌గానే వేసిన బ్యాట్స్‌మన్ మిస్ అయ్యాడు. మూడో బంతికి మేం గెలిచాం. స్వింగ్ మంచి పని చేసింది. చివరి ఓవర్లో 11పరుగులు కొట్టకుండా అదుపుచేయడం విజయ్‌కు కష్టమేమీ కాదు. అలాగే చేశాడు’

ఆ తర్వాత విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ’43వ ఓవర్ తర్వాత నుంచి నేను దీని కోసమే ఎదురుచూస్తున్నా. చివరి ఓవర్లో బౌలింగ్ వేసి 10పరుగులు కూడా చేయకుండా అదుపుచేయాలని భావించా. అనుకున్నట్లుగానే బౌలింగ్ చేసే అవకాశమొచ్చింది. ఏదైతే చేయగలనని భావించానో అది చేసి చూపించా’ అని తెలిపాడు. 
Also Read : విదేశాలకు వెళ్తున్నారా : ఎయిర్‌టెల్‌ Foreign Pass రీఛార్జ్ ఆఫర్