కోహ్లీసేనతో తొలి వన్డే.. కంగారూల టార్గెట్ 256

కోహ్లీసేనతో తొలి వన్డే.. కంగారూల టార్గెట్ 256

భారత బ్యాట్స్‌మెన్‌ను కంగారు పుట్టించారు ఆసీస్ బౌలర్లు. స్టార్క్.. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మరో 2 వికెట్లు తీయగలిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(74; 91బంతుల్లో 9ఫోర్లు,  1సిక్సు)తో హై స్కోరర్ గా నిలిచాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆసీస్ వర్సెస్ భారత్ ల మధ్య జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. 

లంకపై సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్ కు బ్రేక్ వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌ను 255పరుగులకే ఆలౌట్ చేసింది. మిచెల్ స్టార్క్ 3, పాటి కమిన్స్.. రిచర్డ్‌సన్ చెరో 2, ఆడం జంపా.. ఆష్టన్ అగర్ చెరొక వికెట్ తీయగలిగారు. రోహిత్ శర్మ(10), కేఎల్ రాహుల్(47), విరాట్ కోహ్లీ(16), శ్రేయాస్ అయ్యర్(4), రిషబ్ పంత్(28), రవీంద్ర జడేజా(25), శార్దూల్ ఠాకూర్(13), మొహమ్మద్ షమీ(10), కుల్దీప్ యాదవ్(17), జస్ప్రిత్ బుమ్రా(0)పరుగులు చేయగలిగారు. 

హాఫ్ సెంచరీకి ముందు కేఎల్ రాహుల్ అవుట్:
134 పరుగుల జట్టు స్కోర్.. 27.1ఓవర్ల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో రాహుల్ పెవిలియన్ చేరాడు. 61 బంతుల్లో 4 ఫోర్లతో కలిపి 47 పరుగులు చేయగలిగాడు. అగర్ బౌలింగ్ లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎండ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడైన బ్యాటింగ్‌కు చక్కటి భాగస్వామ్యం అందించాడు. 

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికైంది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనున్నాయి. పూర్తి స్థాయి బలాలతో రెండు జట్లు బరిలోకి దిగాయి. దీంతో ఈ వన్డే సిరీస్‌ హోరాహోరీగా జరగనుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా గెలిచిన విరాట్ సేనకు..ఈ సిరీస్ అసలైన పరీక్ష కానుంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవగా.. చివరి మూడు గెలిచిన ఆసీస్‌.. సిరీస్‌ సొంతం చేసుకుంది.