నరాలు తెగే ఉత్కంఠపోరులో ఆసీస్ విజయం

నరాలు తెగే ఉత్కంఠపోరులో ఆసీస్ విజయం

నరాలు తెగే ఉత్కంఠ.. మ్యాచ్ మనదే అని భావించిన క్షణాలన్నీ ఆవిరైపోయాయి. ఎంతో నమ్మకంతో చివరి ఓవర్‌ను అప్పగించిన విరాట్ కోహ్లీకి నిరాశనే మిగిల్చాడు ఉమేశ్ యాదవ్.  మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేశాడు. వైజాగ్ వేదికగా మూడు వికెట్ల తేడాతో ఆసీస్ విజయాన్ని కైవసం చేసుకుంది. చివరి ఓవర్‌కు 7 బంతులకు 14పరుగులు కావల్సిన స్థితిలో బౌలింగ్ తీసుకున్న ఉమేశ్.. ఆసీస్‌కు విజయాన్ని అందుకోవడం సులువు చేసి చూపించాడు.

బ్యాట్స్ మెన్ నిరాశ‌ప‌రిచి కేవ‌లం 127 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఇచ్చినా బౌల‌ర్లు దాదాపు గెలుపు అంచుల వ‌ర‌కూ తీసుకెళ్లారు. కానీ, చివ‌ర్లో అనూహ్య మ‌లుపు తిర‌గ‌డంతో మ్యాచ్ చేజారిపోయింది. 19వ ఓవ‌ర్ బుమ్రా చేతికి ఇవ్వడంతో  2వికెట్లు, రెండు డాట్ బాల్‌లు, రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడిచేశాడు. 15.2 ఓవర్లకు 101 పరుగుల వద్ద ఆర్సీ షాట్‌(37)ను రనౌట్ చేయడం, ఆ తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్‌(56)ను చేయడంతో స్టేడియం మార్మోగిపోయింది. ఆ దశలో మనం గెలుస్తామనిపించింది. కానీ, ఫీల్డర్ల పేలవ ప్రదర్శన, ఆఖరి ఓవర్ మ్యాచ్‌ను అప్పనంగా ఆస్ట్రేలియా చేతికిచ్చినట్లు అయింది. టీమిండియా బౌలర్లు బుమ్రా 3 వికెట్లు, చాహల్ 1, కృనాల్ పాండ్యా1 వికెట్లు పడగొట్టగలిగారు. 

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలో చూపించిన దూకుడును కొనసాగించలేకపోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి పరవాలేదనిపించినా ఆ తర్వాత బంతికే అవుట్ అయి పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను తొలి వికెట్ రోహిత్ (5: 8 బంతుల్లో)పరుగులకే వెనుదిరిగి నిరాశ పరిచాడు. ఆ కాసేపటిలో వికెట్ల పతనానికి విరామమిచ్చిన కోహ్లీ-రాహుల్ ల భాగస్వామ్యాన్ని ఆడం జంపా బ్రేక్ చేశాడు.  జంపా బౌలింగ్‌లో 8.4 ఓవర్లకు కోహ్లీ(24: 17 బంతుల్లో 3 ఫోర్లు)నైల్ ‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఆ తర్వాత వచ్చిన పంత్(3), దినేశ్ కార్తీక్(1), కృనాల్ పాండ్యా(1), ఉమేశ్ యాదవ్(2) సింగిల్ డిజిట్‌కే పరిమితమైయ్యారు. చివర్లో వచ్చిన చాహల్(0), లతో సరిపెట్టుకోగా ధోనీ భాగస్వామ్య లోపంతో రాణించలేకపోయాడు. ఆఖరి వరకూ క్రీజులో నిలిచిన ధోనీ (33) పరుగులు చేశాడు. 

భారత్ వికెట్లను చేజార్చుకుందిలా:
14-1 (రోహిత్ శర్మ, 2.3), 69-2 (విరాట్ కోహ్లీ, 8.4), 80-3 (రిషబ్ పంత్, 10), 92-4 (కేఎల్ రాహుల్, 12.2), 94-5 (దినేశ్ కార్తీక్, 12.6), 100-6 (కృనాల్ పాండ్యా, 14.6), 109-7 (ఉమేశ్ యాదవ్, 16.5)