భారత ఘోర పరాజయం : కోహ్లీ ఒంటరిపోరు ఫలించలేదు

భారత ఘోర పరాజయం : కోహ్లీ ఒంటరిపోరు ఫలించలేదు

టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎంతగా ప్రయత్నించినా పరాభవం తప్పించలేకపోయారు. భారత్‌ను 32 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ తానొక్కడే ఒంటరి పోరాటం చేసి (123; 95 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సు)తో ఆడినప్పటికీ లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్‌ ముంగిట 314 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. 

లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే తడబాటుకు గురై 281పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ శిఖర్ ధావన్(1)తో పేలవంగా అవుట్ అవగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(14) పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ మినహాయించి అంబటి రాయుడు(2), ఎంఎస్ ధోనీ(26), కేదర్ జాదవ్(26), విజయ్ శంకర్(32), రవీంద్ర జడేజా(24), మొహమ్మద్ షమీ(8)కుల్దీప్ యాదవ్(10)లతో పెవలియన్ బాట పట్టగా బుమ్రా(0)తో భారత్‌కు ఓటమి తప్పలేదు. 

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా 31 ఓవర్ల  వరకూ ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడింది. ఈ సమయంలో ఉస్మాన్ ఖవాజా(92), ఆరోన్ ఫించ్ (93)ల 193 పరుగుల భాగస్వామ్యానికి కుల్దీప్ బ్రేక్ వేశాడు. 

యాదవ్ వేసిన బంతి ఫించ్‌ను ఎల్బీడబ్ల్యూగా తాకడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఫించ్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(47) కాసేపటిలోనే రెచ్చిపోయాడు. ఆ తర్వాత స్వల్ప విరామంతోనే వికెట్ల బాట పట్టింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ ఖవాజా (113 బంతుల్లో; 104, 11ఫోర్లు, 1 సిక్సు)తో జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షమీ 1 తీయగలిగారు.