INDvAUS: తొలి ఓవర్.. తొలి వికెట్.. సున్నా స్కోరు

INDvAUS: తొలి ఓవర్.. తొలి వికెట్.. సున్నా స్కోరు

రెండో వన్డేను టీమిండియా పేలవంగా ఆరంభించింది. పాట్ కమిన్స్ వేసిన బౌలింగ్‌లో ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేని భారత్.. రోహిత్ వికెట్ కోల్పోయింది. కమిన్స్ వేసిన 0.6వ బంతికి అవుట్ అయ్యాడు.  ఎక్స్ ట్రా బౌన్స్ లభించిన బంతిని రోహిత్ అప్పర్ కట్ గా మలిచాడు.
Also Read : INDvAUS: రెండో వన్డేలో ఈ రికార్డులు బద్దలయ్యేనా

దురదృష్టవశాత్తు బంతికి సమీపంలోనే జంపా ఉండటంతో క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆసీస్ తొలి ఓవర్లోనే భారత్ తొలి వికెట్ పడగొట్టింది. తొలి వన్డేలో ధావన్, గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. రెండో వన్డేలో రోహిత్ గోల్డెన్ డక్ అయ్యాడు. రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌కు 7పరుగులు వచ్చి చేరాయి. క్రీజులో కోహ్లీ(0), ధావన్(6)లు ఉన్నారు. 
Also Read : IND Vs AUS వ్యూహాలేంటి : విదర్భ వేదికగా రెండో వన్డే