INDvAUS: మూడో వన్డేలో హైలెట్స్ ఇవే..

INDvAUS: మూడో వన్డేలో హైలెట్స్ ఇవే..

రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డే ఆస్ట్రేలియాకు డూ ఆర్ డైగా మారింది. ఈ హోరాహోరీ పోరులో భారత్ ను శాసించి ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి విజయాన్ని చేజిక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియాకు 314పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తీవ్రంగా పోరాడినప్పటికీ 32 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. 
Read Also : తీపి గురుతులు :చిన్ననాటి పార్క్ కు సచిన్ గిఫ్ట్

మూడో వన్డేలో బౌలర్లు చేసిన తప్పిదానికి జట్టు మొత్తం ఓటమికి గురి కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమైన భారత బౌలర్లు 313 పరుగుల స్కోరును కట్టబెట్టారు. టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

216:
ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో ఇద్దరు కెప్టెన్ల(కోహ్లీ 123, ఫించ్ 93) స్కోరు 200కు మించి నమోదు కావడం ఇదే ప్రథమం. 1996లో బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు 193పరుగులు నమోదు చేయగలిగారు. 

4096:
ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా కోహ్లీ 4వేల వన్డే పరుగులు సాధించాడు. అత్యంత త్వరగా 63 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 

350:
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో రోహిత్ శర్మ 350 సిక్సులు నమోదు చేశాడు. ఇన్ని సిక్సులు బాదిన రెండో భారత క్రికెటర్‌గానే కాక, ఆరో అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 367 ఇన్నింగ్స్ లలో షాహిద్ అఫ్రీది పేరిట ఉన్న రికార్డు.. రోహిత్ 331 ఇన్నింగ్స్ లలోనే చేధించగలిగాడు. 

48.2 ఓవర్లకే:
టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతోన్న వన్డేలలో సిరీస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 48.2ఓవర్లతోనే మ్యాచ్ ముగించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 236/7 చేసి లక్ష్యాన్ని చేధించగా, నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 250 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మూడో వన్డేలోనూ 48.2 ఓవర్లు మాత్రమే ఆడి 281 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 
Read Also : ప్రపంచంలోనే ఖరీదైన కారు : ధర 131.33 కోట్లు