INDvAUS: రెండో వన్డేలో ఈ రికార్డులు బద్దలయ్యేనా

INDvAUS: రెండో వన్డేలో ఈ రికార్డులు బద్దలయ్యేనా

భారత్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాను టీమిండియా.. తొలి వన్డేలో చిత్తుగా ఓడించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 237పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన భారత్.. 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో తలపడేందుకు మార్చి 5 మంగళవారం విదర్భ వేదికగా తీవ్రంగా శ్రమించింది. మరోసారి ఆధిక్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న భారత్.. విజయాన్ని దక్కించుకుని జట్టు గతిని మార్చుకోవాలని చూస్తోన్న ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. అయితే విదర్భ వేదికగా ఇరు జట్ల మధ్య నమోదైన రికార్డులిలా ఉన్నాయి. 
Also Read : INDvAUS: తొలి ఓవర్.. తొలి వికెట్.. సున్నా స్కోరు

3-0:
నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా భారత్.. ఆస్ట్రేలియాను 3-0తేడాతో ఓడించింది. 2009లో ఇదే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 99 పరుగుల వ్యత్యాసంతో గెలిచింది. ఆ తర్వాత 2013, 2017లలో జరిగిన మ్యాచ్‌లలో భారత్ చేధనకు దిగి వరుసగా 6, 7 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఇందులో గమనించాల్సిన విషయమేమిటంటే భారత్.. విదర్భ వేదికగా ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఓటమిని చవిచూసింది

11-1:
2012 నుంచి విదర్భ వేదికగా జరిగిన 12 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో ఇప్పటి వరకూ చేధనకు దిగిన జట్టే 11 సార్లు గెలిచింది. వన్డే ఫార్మాట్ లో మాత్రం ముందు బ్యాటింగ్ చేసిన జట్టు 2/8 సార్లు మాత్రమే గెలిచింది.

ఇంకా 10 పరుగులే: 
రవీంద్ర జడేజా వన్డే కెరీర్‌లో 2000 పరుగులు చేయడానికి కావల్సినవి ఇంకా 10 పరుగులు మాత్రమే. మంగళవారం జరగనున్న వన్డే తుది జట్టులో స్థానం దక్కించుకుంటే రికార్డు బద్దలు కొట్టే అవకాశం దక్కించుకున్నట్లే. 

మరొక్క సిక్స్ కొడితే:
హిట్ మాన్ రోహిత్ శర్మ.. మరొక్క సిక్స్ కొడితే 350 సిక్సులు బాది రెండో భారత్ ప్లేయర్‌గా రికార్డు నమోదు చేసుకుంటాడు. ఇప్పటికే ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ధోనీ టీమిండియా తరపున బాదింది 345 సిక్సులే కావడంతో మరొక్క సిక్స్ కొడితే భారత్ తరపున ఆడి అత్యధిక సిక్సులు బాదిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కనున్నాడు. 

21955:
ఆసీస్ ఆటగాళ్లకు రికార్డులకు చేరువగా ఉన్నాయి. షాన్ మార్ష్‌ ఇంకొక 45 పరుగులు చేస్తే 22వేల పరుగుల మైలు రాయిని చేరుకుంటాడు. ఈ మేర ఆరోన్ ఫించ్(18889) పరుగులతో ఉండగా అతనికి ఇంకా 111పరుగులు కావాల్సి ఉంది.  
Also Read : INDvAUS: INDvAUS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా