INDvAUS: 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్

INDvAUS: 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడుతోన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ 314 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభించింది. ఓపెనర్లు ధావన్(1)రోహిత్(14)పరుగులతో వెనుదిరిగారు. 
Also See: INDvAUS: హమ్మయ్య ఒక్క వికెట్ పడింది

జట్టును చక్కదిద్దేందుకు విరాట్ కోహ్లీ బరిలోకి దిగినప్పటికీ మరో ఎండ్‌లో సహకారాన్ని అందించాల్సిన అంబటి రాయుడు(2)పరుగులతో మరోసారి పేలవంగా అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతలను ధోనీ(0), కోహ్లీ(12)లు భుజాన వేసుకుని క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 29/3. 

దూకుడుగా ఆడితే కానీ, చేధించేందుకు సాధ్యం కాని టార్గెట్‌ పట్ల భారత్ నిర్లక్ష్యం వహిస్తోందని నెటిజన్లు వాపోతున్నారు. 
Also See: సైనా ఔట్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్‌లో తప్పని ఓటమి