INDvAUS: విజృంభించిన ఆస్ట్రేలియా, భారత్‌కు భారీ టార్గెట్

INDvAUS: విజృంభించిన ఆస్ట్రేలియా, భారత్‌కు భారీ టార్గెట్

రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 5 వికెట్లు నష్టపోయి 314 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా 31 ఓవర్ల  వరకూ ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడింది. 
Also See: INDvAUS: 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్

ఈ సమయంలో ఉస్మాన్ ఖవాజా(92), ఆరోన్ ఫించ్ (93)ల 193 పరుగుల భాగస్వామ్యానికి కుల్దీప్ బ్రేక్ వేశాడు. యాదవ్ వేసిన బంతి ఫించ్‌ను ఎల్బీడబ్ల్యూగా తాకడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఫించ్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(47) కాసేపటిలోనే రెచ్చిపోయాడు. 

ఆ తర్వాత స్వల్ప విరామంతోనే వికెట్ల బాట పట్టింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ ఖవాజా (113 బంతుల్లో; 104, 11ఫోర్లు, 1 సిక్సు)తో జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షమీ 1 తీయగలిగారు. 
Also See: సైనా ఔట్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్‌లో తప్పని ఓటమి