IndVsAus 3rd T20I : హైదరాబాద్ టీ20.. దంచికొట్టిన డేవిడ్.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

IndVsAus 3rd T20I : హైదరాబాద్ టీ20.. దంచికొట్టిన డేవిడ్.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

IndVsAus 3rd T20I : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత్ ముందు 187 పరుగుల చాలెంజింగ్ టార్గెట్ నిర్దేశించింది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ డేవిడ్, ఓపెనర్ కామెరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీలతో మెరిశారు.

కామెరూన్ 21 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత టిమ్ డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లోనే 54 పరగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. క్రీజులో ఉన్నంత సేపు టిమ్ డేవిడ్ వీరవిహారం చేశాడు. ఆసీస్ జట్టు భారీ స్కోర్ చేయడంలో టిమ్ డేవిడ్ కీ రోల్ ప్లే చేశాడు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును టిమ్ డేవిడ్ ఆదుకున్నాడు. ఆసీస్ మిగతా బ్యాటర్లలో ఆరోన్ ఫించ్‌ 7, స్టీవ్‌ స్మిత్ 9, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ 6, జోష్‌ ఇంగ్లిస్‌ 24, డానియల్‌ సామ్స్ 28* పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. 20వ ఓవర్‌లో హర్షల్ పటేల్ సిక్స్ సహా ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత్‌కు 187 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.

చివరి ఓవర్లలో ఆసీస్‌ బ్యాటర్లు వీర విహారం చేశారు. 19వ ఓవర్‌ వేసిన బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌ సహా మొత్తం 18 పరుగులు వచ్చాయి. అంతకుముందు భువీ వేసిన ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి.

మూడు టీ20ల సిరీస్ లో.. చెరో మ్యాచ్‌ నెగ్గిన భారత్‌, ఆసీస్‌.. నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.