అప్పుడే ఆరు వికెట్లా: మూడు డకౌట్లు

అప్పుడే ఆరు వికెట్లా: మూడు డకౌట్లు

బంగ్లా బోల్తా కొట్టినట్లేననిపిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదలైన చారిత్రత్మక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో భారత పేసర్లు విజృంభిస్తున్నారు. మ్యాచ్ మొదలైన రెండు గంటల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా బ్యాట్స్ మెన్ ను శాసిస్తున్నారు. 

ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ 2, షమీ ఒక వికెట్ దక్కించుకోగలిగారు. ఓపెనర్ 29 పరుగులు మాత్రమే జట్టుకు అత్యధిక స్కోరు చేయగలిగాడు. మిగిలిన నలుగురు ప్లేయర్లు మోమినుల్ హక్, మొహమ్మద్ మిథున్, ముష్ఫికర్ రహీమ్ డకౌట్లుగా వెనుదిరిగారు. 

ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ కేవలం 7పరుగులు మాత్రమే ఇచ్చి 2వికెట్లు పడగొట్టాడు. 20ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో లిటన్ దాస్(15), నయీమ్ హుస్సేన్(0)నిలిచారు.