లంచ్ విరామం: బంగ్లా స్కోరు 63/3

లంచ్ విరామం: బంగ్లా స్కోరు 63/3

వ్యూహానికి తగ్గట్లుగానే భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్ పై పరుగులు కట్టడి చేస్తూ బ్యాట్స్‌మెన్‌కు ఒత్తిడి పెంచుతున్నారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటింగ్ కే అనుకూలమని ముందుగా గ్రహించాయి ఇరు జట్లు. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన వెంటనే బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

కోహ్లీసేన బంగ్లాను కట్టడి చేసే పనిలో భాగంగా ఫేసర్లను రంగంలోకి దింపి లంచ్ విరామానికి కంటే ముందుగా మూడు వికెట్లు పడగొట్టింది. క్రీజులో నిలదొక్కుకునే క్రమంలో బంగ్లా బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనర్లిద్దరూ శాద్ మాన్ ఇస్లామ్(6), ఇమ్రుల్ కేస్(6) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. 

మూడో వికెట్ గా మొహమ్మద్ మిథున్(13) పెవిలియన్ చేరాడు. దీంతో భారత ఫేసర్లు ఇషాంత్, ఉమేశ్, షమీలకు తలో వికెట్ తీయగలిగారు. లంచ్ విరామానికి క్రీజులో 63/3పరుగుల వద్ద మొమినుల్ హక్(22), ముష్‌ఫికర్ రెహ్మాన్(14) ఉన్నారు.