ఇన్నింగ్స్‌కు బ్రేక్.. 160 పరుగుల ఆధిక్యంలో భారత్

మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్‌ అయింది. 294/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 365 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ముగిసింది.

ఇన్నింగ్స్‌కు బ్రేక్.. 160 పరుగుల ఆధిక్యంలో భారత్

INDvsENG: మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్‌ అయింది. 294/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా… 365 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్సులో 160 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

వాషింగ్టన్ సుందర్ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. 174 బంతులు ఆడిన 10 ఫోర్లు, ఒక సిక్స్‌‌తో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రనౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మ, సిరాజ్ డకౌట్ అయ్యారు.

రూట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 113వ ఓవర్‌ చివరి బంతికి 43 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌ అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత 114వ ఓవర్‌ వేసిన బెన్‌ స్టోక్స్‌ చివరి రెండు వికెట్లు తీశాడు. మొదటి బంతికి ఇషాంత్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన స్టోక్స్‌ మూడో బంతికి సిరాజ్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించిన సుందర్‌ సెంచరీ చేసే అవకాశం రాకపోవడం నిరాశను మిగిల్చింది.

ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, బెన్ స్టోక్స్ 4 వికెట్లు, జాక్ లీచ్ ఒక వికెట్ తీసుకున్నారు.