IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్

బర్మింగ్ హామ్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది.

IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్

Indvseng 5th Test

IndVsEng 5th Test : బర్మింగ్ హామ్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ రసవత్తరంగా మారింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ కు 378 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ పిచ్ పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న నేపథ్యంలో, ఇంగ్లండ్ లక్ష్యఛేదన అంత సులభం కాకపోవచ్చని క్రీడా నిపుణులు అంటున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

నాలుగో రోజు 125/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో టీమిండియా ఆటను ప్రారంభించింది. భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో పుజారా, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. పుజారా 168 బంతుల్లో 66 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 86 బంతుల్లో 57 రన్స్ చేశాడు. రవీంద్ర జడేజా 58 బంతుల్లో 23 పరుగులు, విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 20 పరుగులు చేశారు.

Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీశాడు. స్టువర్ట్ బ్రాడ్, పాట్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అండర్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్‌లెంట్.. స్టన్నింగ్‌ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్