INDvsNZ: టీమిండియా టార్గెట్ 165

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. భారీ స్కోరు చేయకుండా కివీస్ ను కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి

INDvsNZ: టీమిండియా టార్గెట్ 165

Team India

INDvsNZ: టీమిండియా కోచ్ గా రాహుల్‌ ద్రవిడ్‌.. రెగ్యూలర్ కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై విజయం కోసం వ్యూహాలు రచిస్తుంది టీమిండియా. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. భారీ స్కోరు చేయకుండా కివీస్ ను కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (0)ను భువనేశ్వర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసిన భారత్‌కు అందించాడు. క్రీజులోకి వచ్చిన మార్క్‌ చాప్‌మన్‌ (63: 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (70: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వెంటవెంటనే చాప్‌మన్‌తోపాటు ఫిలిప్స్‌ (0) పెవిలియన్‌కు చేరారు.

అశ్విన్‌ కే ఈ రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఫర్ట్‌ (12)తో కలిసి గప్తిల్‌ ధాటిగా ఆడాడు. గప్తిల్‌, సీఫర్ట్‌ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో కివీస్‌ స్కోరు బోర్డు వేగం తగ్గింది. కివీస్‌ బ్యాటర్లలో రచిన్‌ రవింద్ర 7, సాట్నర్ 4* పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 2, భువనేశ్వర్‌ 2.. చాహర్, సిరాజ్‌ చెరో వికెట్‌ తీయగలిగారు.

…………………………………….: హాట్ యాంకర్ శ్రావ్య.. పోజులు చూసినా కిక్కే!