IndVsSA 1st ODI : సౌతాఫ్రికాతో తొలి వన్డే.. దంచికొట్టిన డేవిడ్ మిల్లర్.. భారత్ టార్గెట్ 250

మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్) దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు.

IndVsSA 1st ODI : సౌతాఫ్రికాతో తొలి వన్డే.. దంచికొట్టిన డేవిడ్ మిల్లర్.. భారత్ టార్గెట్ 250

IndVsSA 1st ODI : లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ లో ఓవర్లను 40కి తగ్గించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్) దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. అంతకుముందు, క్వింటన్ డికాక్ 48, జానెమన్ మలాన్ 22 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ టెంబా బవుమా (8) విఫలం కాగా, ఐడెన్ మార్ క్రమ్ (0) డకౌట్ అయ్యాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఓ అద్భుతమైన బంతితో మార్ క్రమ్ ను బౌల్డ్ చేయడం హైలైట్ గా నిలిచింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 22 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలోనే లభించాయి. టీమిండియా బౌలర్లు ఏకంగా 15 వైడ్లు విసిరారు.