IndVsSA 2nd T20I : రెండో టీ20లోనూ సౌతాఫ్రికాపై భారత్ విజయం, సిరీస్ కైవసం.. దడదడలాడించిన డేవిడ్ మిల్లర్

టీ20లలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. పోరాడి ఓడింది.

IndVsSA 2nd T20I : రెండో టీ20లోనూ సౌతాఫ్రికాపై భారత్ విజయం, సిరీస్ కైవసం.. దడదడలాడించిన డేవిడ్ మిల్లర్

IndVsSA 2nd T20I : టీ20లలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోరు(237/3 ) చేసింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. పోరాడి ఓడింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సఫారీ జట్టు బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ శివాలెత్తాడు. భారత బౌలర్లను చీల్చి చెండాడు. పరుగుల వరద పారించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. మిల్లర్ పోరాడినా సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు.

మిల్లర్ 47 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధాటిగా ఆడిన మిల్లర్ 46 బంతుల్లోనే సెంచరీ బాదాడంటే.. ఏ రేంజ్ లో అతడి బ్యాటింగ్ సాగిందో అర్థం చేసుకోవచ్చు. అతడి స్కోర్ లో 7 సిక్స్ లు, 8 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో డికాక్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. డికాక్ 48 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భాతర బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలుండగానే.. 2-0 తేడాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్. ఇక నామమాత్రమైన మూడో టీ20 ఇండోర్‌ వేదికగా జరగనుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

డికాక్, మిల్లర్ జోడీ చివరి దాకా నిలిచి పోరాడినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 174 పరుగులను జోడించారు. ముఖ్యంగా మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంత సేపు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సుల వర్షం కురిపించాడు. మిల్లర్ దూకుడు చూసి అంతా భయపడ్డారు. సౌతాఫ్రికా గెలుస్తుందేమోనని కంగారు పడ్డారు. కానీ, టార్గెట్ భారీగా ఉండటంతో.. మిల్లర్ పోరాటం ఫలితాన్ని ఇవ్వలేదు.

టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(57), రోహిత్‌(43) వీరవిహారంతో జట్టుకు శుభారంభం లభించింది. అనంతరం సూర్యకుమార్‌ యాదవ్ ‌(61), కోహ్లీ(49 నాటౌట్‌) విరుచుకుపడ్డారు. సెంచరీ (102) భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్ టీ20ల్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (573 బంతుల్లో) వెయ్యి పరుగుల మార్క్‌ను తాకిన బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ పేరిట ఉండేది. మ్యాక్స్ వెల్ 604 బంతుల్లో వెయ్యి రన్స్ చేశాడు. ఆ రికార్డును సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు. 18.1 ఓవర్లలో 209 పరుగుల వద్ద సూర్యకుమార్‌ ఔటైనప్పటికీ.. భారత్ స్కోరు మాత్రం ఆగలేదు. దినేశ్‌ కార్తిక్‌ (17*) చివర్లో బాదేశాడు.

ఈ మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు. సౌతాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ నుంచి దినేశ్ కార్తీక్ వరకు బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్యకుమార్ యాదవ్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. సఫారీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 22 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.