IndVsSA 3rd ODI : మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

IndVsSA 3rd ODI : మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

IndVsSA 3rd ODI : సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. మూడో వన్డేలో సఫారీ జట్టు నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని.. భారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా బ్యాటర్లలో శుభమన్ గిల్ (57 బంతుల్లో 49 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 28 పరుగులు) రాణించారు. సఫారీ బౌలర్లు ఎంగిడి, ఫోర్టుయిన్ చెరో వికెట్‌ తీశారు.

భారత్ తొలుత బౌలింగ్ చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భారత్ స్పిన్ మ్యాజిక్ ధాటికి దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, పేసర్ మహ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు తీశారు.

తొలి రెండు వన్డేల్లో మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సఫారీలు.. నిర్ణయాత్మక మూడో వన్డేలో ఢిల్లీ పిచ్ పై తేలిపోయారు. దక్షిణాఫ్రికా జట్టులో హెన్రిచ్ క్లాసెన్ చేసిన 34 పరుగులే అత్యధికం. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను టీమిండియా బౌలర్లు కుదురుకోనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచారు. సఫారీ ఇన్నింగ్స్ లో చివరి నాలుగు వికెట్లు కుల్దీప్ ఖాతాలో చేరాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని పసిగట్టిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతేకాదు, ఇన్నింగ్స్ తొలి ఓవర్ విసిరే చాన్స్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కు అప్పగించాడు.

సుందర్ తన రెండో ఓవర్లో ప్రమాదకర డికాక్ ను ఔట్ చేసి శుభారంభం అందించాడు. అక్కడి నుంచి సఫారీల పతనం షురూ అయింది. మరో ఎండ్ లో పేసర్ సిరాజ్, స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ కూడా విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది.