IndVsSA 3rd T20I : రఫ్పాడించిన రూసో.. మెరుపు సెంచరీ.. భారత్ ముందు బిగ్ టార్గెట్

సౌతాఫ్రికా జట్టు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉంది. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు.

IndVsSA 3rd T20I : రఫ్పాడించిన రూసో.. మెరుపు సెంచరీ.. భారత్ ముందు బిగ్ టార్గెట్

IndVsSA 3rd T20I : ఇప్పటికే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు చివరి టీ20లో గెలిచి పరువు నిలుపుకునేందుకు పట్టుదలతో ఉంది. ఇండోర్ మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు.

సౌతాఫ్రికా బ్యాటర్ రిలే రూసో మెరుపు సెంచరీ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. భారత్ ముందు 228 భారీ టార్గెట్ నిర్దేశించింది. రూసో కేవలం 48 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. మైదానం చిన్నది కావడంతో పరుగులు వెల్లువెత్తాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 68 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా (3) ఆరంభంలోనే వెనుదిరిగినా.. రూసో, డికాక్ జోడీ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ట్రిస్టాన్ స్టబ్స్ 23, డేవిడ్ మిల్లర్ 5 బంతుల్లో 19 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో చాహర్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీశారు. కాగా, 2-1తేడాతో మూడు టీ20ల సిరీస్ ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.