IndvsSL: హార్దిక్ పాండ్యా బెంచ్‌కే పరిమితమా…

మరో సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా కాచుకుని కూర్చొంది. నిర్ణయాత్మక టీ20లో గెలుపు కోసం లంక.. టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్‌తో మరోసారి పాండ్యా బౌలింగ్ అవకాశం చేజిక్కించుకుంటాడని భావిస్తే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.

10TV Telugu News

IndvsSL: మరో సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా కాచుకుని కూర్చొంది. నిర్ణయాత్మక టీ20లో గెలుపు కోసం లంక.. టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్‌తో మరోసారి పాండ్యా బౌలింగ్ అవకాశం చేజిక్కించుకుంటాడని భావిస్తే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న టీ20 ఫార్మాట్ కావడంతో సద్వినియోగపరచుకోవాలని భావిస్తున్నారు. ఈ మేర పాండ్యాను బెంచ్ కే పరిమితం చేస్తారా అనేది చూడాలి మరి.

ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడిన పాండ్యా.. ఫామ్ లో లేకపోవడం ఫిట్‌నెస్ కొరతతో కనిపిస్తున్నారు. ఫీల్డింగ్ లో మాత్రమే కాదు, బౌలింగ్, బ్యాటింగ్ లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరుస్తున్నారు. వైట్ బాల్ జట్టులో పాండ్యా కీలకమైన వ్యక్తి.. కాకపోతే ఇప్పుడు శిఖర్ ధావన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతణ్ని పక్కకు పెట్టేలా కనిపిస్తున్నారు.

పాండ్యా చేస్తున్న తప్పులేంటి:
*మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో.. పాండ్యా 14ఓవర్ల పాటు బౌలింగ్ వేసి కేవలం 2వికెట్లు మాత్రమే తీశాడు.
*బ్యాటింగ్ లో మూడు ఇన్నింగ్స్ ఆడి 29పరుగులు, ఒక డకౌట్ కూడా అయ్యాడు.
*తొలి టీ20లో స్కోరు చేయాల్సిన సమయంలో 21 బంతులు ఆడి 19పరుగులు మాత్రమే చేశాడు.
*బౌలింగ్ లోనూ.. అతను వేస్తున్న లెంగ్త్ కన్విన్సింగ్ గా లేదు. ఇంకా బ్యాట్స్‌మన్ ఈజీగా స్కోర్ చేసేలా కనిపిస్తుంది.
*ఫీల్డింగ్ లోనూ పేలవంగా ఉన్నాడు. తొలి టీ20 మ్యాచ్ లో క్యాచ్ జారవిడిచాడు.

పృథ్వీ షా.. సూర్యకుమార్ యాదవ్ కూడా:
టీమ్ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను మాత్రమే కాకుండా పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ లపై కూడా నిర్ణయం తీసుకోనుంది. వీరిద్దరినీ వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ పంపేందుకు ప్లాన్ చేస్తుంది. మంగళవారం లేదా బుధవారం బయల్దేరాల్సి ఉండటంతో మ్యాచ్ కు అందుబాటులో ఉండటం అనుమానస్పదమే.

జట్లు (అంచనా): శిఖర్ ధావన్ (సి), పృథ్వీ షా / దేవదత్ పాడికల్, సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్ / మనీష్ పాండే, ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి

10TV Telugu News